Pakistani Actor: ఏప్రిల్ 22న జమ్మూ కాశ్మీర్‌లోని పహల్గామ్ ప్రాంతంలో జరిగిన ఉగ్రదాడిలో 26 మంది పర్యాటకులు మృతి చెందారు. ఈ ఘటనపై దేశవ్యాప్తంగా ఆగ్రహం వ్యక్తమవుతోంది. ఈ క్రమంలో పాకిస్థానీ నటుడు ఫహద్ ఖాన్, బాలీవుడ్ నటి వాణీ కపూర్ జంటగా నటించిన 'అబీర్ గులాల్' చిత్రం తీవ్ర విమర్శలను ఎదుర్కుంటోంది.
యూట్యూబ్ నుంచి సాంగ్స్ డిలీట్
ఫహద్ ఖాన్ సినిమాను బహిష్కరించాలి అంటూ సోషల్ మీడియాలో పోస్టులు వైరల్ అవుతున్నాయి. ఈ నేపథ్యంలో 'అబీర్ గులాల్' చిత్రం నుంచి విడుదలైన 'ఖుదాయా ఇష్క్', 'అంగ్రేజీ రంగరసియా' పాటలను యూట్యూబ్ నుంచి తొలగించారు. ఈ పాటలు ఈ నెల ప్రారంభంలో విడుదలయ్యాయి.
అలాగే ఏప్రిల్ 25న , ఈ పాటలు విడుదలైన ‘A Richer Lens Entertainment’, సారేగామా యూట్యూబ్ ఛానెల్స్ నుంచి కూడా తీసివేశారు. అయితే బుధవారం ఈ సినిమా నుంచి 'టైన్ టైన్' అనే మరో కొత్త పాట విడుదల చేయాలని ప్లాన్ చేశారు. కానీ,ఉగ్రదాడి కారణంగా ఆ పాటను రిలీజ్ చేయలేదు. సోషల్ మీడియాలో పెరుగుతున్న వ్యతిరేకతకు ప్రతిస్పందనగా ఈ నిర్ణయం కనిపిస్తుంది.
ఇదిలా ఉంటే నటుడు ఫహద్ ఖాన్ ఉగ్రదాడిని తీవ్రంగా ఖండిస్తూ తన సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టారు. పహల్గామ్ లో జరిగిన క్రూరమైన దాడి గురించి వినడం బాధాకరం. బాధితుల కుటుంబాలకు నా ప్రార్థనలు, వారికి భగవంతుడు మరింత బలం ఇవ్వాలని ఆకాంక్షిస్తున్నాను అని తెలిపారు.
I&B Ministry sources say the movie ‘Abir Gulal’ starring Pakistani actor Fawad Khan will not be allowed to release in India. pic.twitter.com/tJxCuW74g2
— Press Trust of India (@PTI_News) April 24, 2025
అయితే ఏప్రిల్ 24న PTI తెలిపిన వివరాల ప్రకారం.. దేశంలో ఉగ్రదాడి నేపథ్యంలో 'అబీర్ గులాల్' చిత్రం భారతదేశంలో విడుదలకు అనుమతి ఉండదు అని పేర్కొన్నారు. ఈ చిత్రంలో లీసా హేయ్డన్, రిద్ధి డోగ్రా, ఫరీదా జలాల్, సోని రజ్దాన్, మరియు పర్మీత్ సేథీ కీలక పాత్రల్లో నటించారు.
telugu-news | latest-news | cinema-news | Pakistani actor Fawad Khan | Abir Gulaal songs