సీఐ మర్మాంగాలు కోసి చంపిన కేసు.. కానిస్టేబుల్‌ దంపతుల అరెస్ట్‌

మహబూబ్‌నగర్‌ సీసీఎస్‌ సీఐ ఇఫ్తేకార్‌ అహ్మద్‌ హత్య కేసు రాష్ట్రవ్యాప్తంగా సంచలనం రేపిన సంగతి తెలిసిందే. కాగా ఈ ఘటనకు కారణమైన కానిస్టేబుల్‌ దంపతులను పోలీసులు అరెస్టు చేశారు. పరారీలో ఉన్న వారిద్దరినీ బుధవారం సాయంత్రం పట్టుకుని రిమాండ్‌కు తరలించినట్లు డీఎస్పీ మహేష్ తెలిపారు.

New Update
సీఐ మర్మాంగాలు కోసి చంపిన కేసు.. కానిస్టేబుల్‌ దంపతుల అరెస్ట్‌

మహబూబ్‌నగర్‌ సీసీఎస్‌ సీఐ ఇఫ్తేకార్‌ అహ్మద్‌ హత్య కేసు రాష్ట్రవ్యాప్తంగా సంచలనం రేపిన సంగతి తెలిసిందే. కాగా ఈ ఘటనకు కారణమైన కానిస్టేబుల్‌ దంపతులను పోలీసులు అరెస్టు చేశారు. పరారీలో ఉన్న వారిద్దరినీ బుధవారం సాయంత్రం పట్టుకుని రిమాండ్‌కు తరలించినట్లు డీఎస్పీ మహేష్ తెలిపారు.

ఈ మేరకు మహేష్‌ తెలిపిన వివరాల ప్రకారం.. మహబూబ్‌నగర్‌ మొదటి పట్టణ ఠాణాలో జగదీశ్‌ కానిస్టేబుల్‌ గా పనిచేస్తున్నారు. అతని భార్య శకుంతల ఎస్పీ కార్యాలయంలోని గ్రీవెన్స్‌సెల్‌లో కానిస్టేబుల్ గానే విధులు నిర్వహిస్తోంది. అయితే 2009 బ్యాచ్‌కు చెందిన వీరిద్దరూ 2011లో లవ్ మ్యారేజ్ చేసుకున్నారు. ఈ క్రమంలోనే 2018లో ఎస్పీ కార్యాలయంలో డీసీఆర్‌బీ సీఐగా పని చేస్తున్న ఇఫ్తేకార్‌ అహ్మద్‌కు శకుంతలతో పరిచయం ఏర్పడింది. అనంతరం బదిలీపై వెళ్లిపోయిన అహ్మద్‌.. గత ఏడాది డిసెంబరు 10న తిరిగి మహబూబ్‌నగర్‌ వచ్చారు. అప్పటినుంచి శకుంతులతో టచ్ లోనే ఉంటూ చాటింగ్ చేస్తున్నాడు. ఈ విషయం గమనించిన జగదీశ్.. మార్చి 8న వారిద్దరికీ ప్రవర్తన మార్చుకోవాలని వార్నింగ్ ఇచ్చాడు.

ఈ క్రమంలోనే నవంబర్ 1న రాత్రి డ్యూటీకి వెళ్లిన జగదీశ్.. ఎవరైనా తన ఇంటికొస్తే ఫోన్‌ చేయాలని ఇంట్లో సహాయకుడిగా ఉంటున్న ఉప్పునుంతలకు చెందిన కృష్ణకు చెప్పాడు. ఇదే సమయంలో రాత్రి ఇంటికి వస్తానని శకుంతలకు సీఐ మెసేజ్‌ పంపాడు. దీంతో భర్త ఇంట్లోనే ఉన్నాడని ఆమె రిప్లై ఇచ్చింది. అయినా వినకుండా రాత్రి 11.20 గంటలకు ఎస్‌ఆర్‌నగర్‌కు కారులో వచ్చి ఇంటికెళ్లి తలుపుకొట్టాడు. ఇది గమనించిన కృష్ణ వెంటనే జగదీశ్‌కు సమాచారం అందించాడు. వెంటనే వచ్చిన జగదీశ్ శకుంతలతో సీఐ మాట్లాడుతుండగానే దాడి చేశాడు. కృష్ణ కూడా సహకరించాడు. తప్పించుకోబోయిన సీఐపై వెంటాడి దాడి చేయడంతో స్పృహ కోల్పోగా అక్కడే ఉన్న సీఐ కారులోనే వెనుక సీటులో అనుమానం రాకుండా కూర్చోబెట్టారని వివరించారు.

Read also :Maharashtra: ఆమె వయసు 17 ఏళ్లే.. చేసే పని చూసి పోలీసులే షాక్..

అయితే ఈ ఘటన తర్వాత తాను విధుల్లోనే ఉన్నట్లు నమ్మించేందుకు ఏఎస్‌ఐతో ఫొటో దిగి పోలీస్‌ గ్రూపులో పోస్టు చేశాడు జగదీశ్. ఇక కారును కొంతదూరం తీసుకెళ్లిన కృష్ణ అక్కడే వదిలేసి ఇంటికి వచ్చాడు. మళ్లీ తెల్లవారుజామున 3.36 గంటలకు కారు దగ్గరకు వెళ్లిన సీఐని బయటకు దించి పెద్దరాయితో తలపై కొట్టారు. బట్టలిప్పి కత్తితో విచక్షణారహితంగా ఒంటిపై గాట్లు పెట్టారు. కత్తిని అక్కడే ఓ డ్రైనేజీలో పడేశారు. అనంతరం ఇంటికి చేరుకొని శకుంతలకు విషయం చెప్పగా రక్తపు మరకలు పడ్డ వారి దుస్తులను కాల్చేసి ఆధారాలు లేకుండా చేసేందుకు ప్రయత్నించింది. ఆ మరుసటి రోజు తన అన్నకు ఫోన్‌ చేసి విషయం చెప్పింది. వెంటనే పోలీసు అధికారులకు సమాచారం ఇవ్వాలని ఆయన చెప్పడంతో ఎస్పీకి, సీఐకి ఫోన్‌ చేసి వివరించింది. అనంతరం ముగ్గురూ ఇంట్లో నుంచి పరారయ్యారు. అప్పటికే ఉదయం నడకకు వచ్చిన వారు కారులో ఉన్న సీఐని గమనించి ఎస్సై వెంకటేశ్వర్లుకు సమాచారం అందించారు. అప్పటి నుంచి హైదరాబాద్‌లో చికిత్స పొందుతూ వచ్చిన సీఐ మంగళవారం మృతిచెందారు. నిందితుల కోసం గాలిస్తున్న పోలీసులు జగదీశ్‌, శకుంతలను నగరంలోని ఓ నర్సరీ వద్ద పట్టుకోగా కృష్ణ అచూకి లభించలేదని తెలిపారు.

Advertisment
తాజా కథనాలు