/rtv/media/post_attachments/wp-content/uploads/2024/06/mla-6.jpg)
Karimnagar District : కరీంనగర్ జిల్లా చొప్పదండి కాంగ్రెస్ (Congress) ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం (Medipally Sathyam) ఇంట తీవ్ర విషాదం చోటు చేసుకుంది. ఎమ్మెల్యే భార్య రూపాదేవి గురువారం సాయంత్రం ఆత్మహత్య చేసుకున్నారు. హైదరాబాద్ అల్వాల్ లోని పంచశీల కాలనీలోని ఇంట్లో ఉరేసుకుని ఆమె ఆత్మహత్య (Suicide) చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు.
ఈ విషయం గురువారం అర్థరాత్రి దాటిన తరువాత ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఆమె వికారాబాద్ జిల్లాలో ప్రభుత్వ ఉపాధ్యాయురాలిగా విధులు నిర్వహిస్తున్నారు. బలవన్మరణానికి కారణాలు తెలియలేదు. ఎమ్మెల్యే దంపతులకు ఇద్దరు పిల్లలు ఉన్నారు. రూపాదేవి గత రెండు రోజులుగా పాఠశాలకు వెళ్లడం లేదు.
ఎమ్మెల్యే సత్యం ఉదయమే నియోజకవర్గానికి వెళ్లారు. సాయంత్రం వరకు అక్కడే ఉన్నారు. కొద్దిరోజుల క్రితం ఎమ్మెల్యే కుటుంబం ఇతర బంధువులతో కలిసి తిరుమల సహా మరికొన్ని పుణ్యక్షేత్రాలను దర్శించుకుని వచ్చారు. రూపా మృతదేహాన్ని పోలీసులు కొంపల్లిలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
Also read: యూజీసీ నెట్‌పై సీబీఐ ఎఫ్ఐఆర్ నమోదు..నీట్‌పై సుప్రీం విచారణ