Life style:ఎలా ఉన్నా సన్నగా కనిపించాలా...అయితే ఇలా డ్రెస్ చేసుకోండి

లావు, సన్నం ఇదో అబ్సెషన్. సన్నగా ఉన్నవాళ్ళకు ఏమీ ఉండదు కానీ లావుగా ఉన్నవాళ్ళు మాత్రం సన్నగా కనిపించాలని తెగ తాపత్రయ పడతారు. అలాంటి వారు ఎక్సర్సైజ్ చేయడమే కాదు...డ్రెస్సింగ్ సెన్స్ ను కూడా పాటించాలి.

Life style:ఎలా ఉన్నా సన్నగా కనిపించాలా...అయితే ఇలా డ్రెస్ చేసుకోండి
New Update

కొంతమంది లావుగా ఉన్నా.. వారి డ్రెస్సింగ్ ఆధారంగా సన్నగా కనిపించేలా జాగ్రత్తలు తీసుకుంటారు. కొంతమంది సన్నగా ఉన్నా.. వారు చేసే తప్పులతో చూడ్డానికి లావుగా కనిపిస్తారు. అందుకే డ్రెస్సింగ్ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. మన బాడీకి ఎలాంటి బట్టలు నప్పుతాయో చూసుకుని మరీ వేసుకోవాలి.డ్రెస్ తీసుకున్నా అవి ఎక్కువగా డిజైన్స్, గజిబిజీగా ఉండకుండా చూసుకోవాలి. వీటితో పాటూ మంచి బ్రైట్ కలర్స్ కూడా ఉండాలి. అదే విధంగా అడ్డంగా లైన్స్ ఉండడం, హరిజెంటల్ డిజైన్స్ ఉండకుండా చూసుకోవాలి.

Also Read:అందరినీ ఎలిమినేట్ చేసి చివరికి ఈ వారం తేజానే వెళ్ళిపోయాడు..సందీప్ కౌంటర్

బట్టలు లూజ్‌గా ఉండడం వేరు, కంఫర్ట్‌గా ఉండడం వేరు. లూజ్‌గా ఉండేవి వేసుకోవడం వల్ల లుక్ మొత్తం మారిపోతుంది. కాబట్టి, అలా కాకుండా మీకు సరైన ఫిట్టింగ్ ఉండేలా చూసుకోండి. దీంతో చూడ్డానికి అందంగా, సన్నగా కనిపిస్తారు. ఇదే పద్ధతిని ప్యాంట్స్ విషయంలో కూడా పాటించాలి.ఇవి కూడా కరెక్ట్ ఫిట్‌గా ఉండాలి. లూజ్‌గా ఉన్న ప్యాంట్స్ వేస్తే లోయర్ బాడీ లావుగా కనిపించేలా చేస్తుంది. కాబట్టి, మంచి ఫిట్టింగ్ జీన్స్, ప్యాంట్స్ వేసుకోవాలి.

fit

ఎ లైన్ డ్రెస్సెస్...ఇవి వేసుకుంటే మంచి ఫిట్‌గా కనిపిస్తారు. ఇవి చూడ్డానికి స్లిమ్‌గా కనిపించేలా చేస్తాయి. కాస్తా పొడుగ్గా ఉన్న కుర్తాలు చక్కగా పొడుగ్గా కనిపించేలా చేస్తాయి.అలాగే మందంగా ఉండే బట్టలు వేసుకుంటే కూడా లావుగా కనిపిస్తారు. కాబట్టి, ఆడ, మగ ఎవరైనా సరే లావుగా ఉండే బట్టలు వేసుకోకుండా సరైన సైజ్ బట్టలు వేసుకోవాలని గుర్తుపెట్టుకోండి. దీంతో పాటూ ఎంత ఖర్చు పెట్టినా కూడా అవి పర్ఫెక్ట్ ఫిట్టింగ్ ఉండాలి. అప్పుడే అవి అందంగా కనిపిస్తాయి. కొన్ని సార్లు తక్కువ ధర పెట్టినా అందంగా కనిపిస్తాయి. అందుకే కచ్చితంగా చక్కని ఫిట్టింగ్ ఉండేలా చూసుకోవాలి. ముఖ్యంగా అందరికీ ఒకేలాంటి బట్టలు సూట్ కావు. ఎవరికో ఏదో బావుందని...మనమూ వాటిని వేసుకోవడానికి ట్రై చేయకూడదు. మనకు ఏవి సూట్ అవుతాయో వాటినే ట్రై చేయాలి. ఎక్కువగా గజిబిజీ డిజైన్స్ ఉండకుండా వీలైనంత తక్కువ డిజైన్స్ ఉండేలా చూసుకోవాలి.

అదే విధంగా ఫిట్‌‌గా ఉండాలి కదా అని మరి టైట్‌గా ఉండకూడదు. ఇవి చూడ్డానికి చాలా ఎబ్బెట్టుగా ఉంటాయి. అందుకే పర్ఫెక్ట్‌గా ఉండాలి. నిలువుగా ఉన్న డిజైన్స్ వేసుకుంటే అవి చూడ్డానికి పొడుగ్గా కనిపించడమే కాదు. సన్నగా కనిపించేలా చేస్తాయి.

#life-style #fat #dressing #lean
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe