Thangalaan : రా అండ్ రస్టిక్ గా 'తంగలాన్' ట్రైలర్.. విక్రమ్ నట విశ్వరూపం! చియాన్ విక్రమ్ నటించిన లేటెస్ట్ మూవీ 'తంగలాన్'. తాజాగా ఈ చిత్ర ట్రైలర్ రిలీజ్ చేశారు మేకర్స్. రా అండ్ రస్టిక్ గా ఉన్న ఈ ట్రైలర్ లో విక్రమ్ తన నట విశ్వరూపం చూపించాడు. యాక్షన్ సీక్వెన్స్ లు హైలైట్ గా నిలిచాయి. జీవీ ప్రకాష్ కుమార్ బీజీయం ప్రధాన ఆకర్షణగా నిలిచింది. By Anil Kumar 11 Jul 2024 in సినిమా ట్రెండింగ్ New Update షేర్ చేయండి Chiyaan Vikram's Thangalaan Trailer : కోలీవుడ్ (Kollywood) స్టార్ హీరో చియాన్ విక్రమ్ (Chiyaan Vikram) నటించిన లేటెస్ట్ మూవీ 'తంగలాన్'.'కబాలి' డైరెక్టర్ పా. రంజిత్ తెరకెక్కించిన ఈ మూవీపై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ సినిమాలో విక్రమ్ ఓ ప్రత్యేక గెటప్ లో విభిన్న తరహా పాత్రలో నటిస్తున్నాడు. 19వ శతాబ్దం బ్యాక్ డ్రాప్ లో పీరియాడికల్ డ్రామాగా ఈ మూవీ రూపొందుతోంది. సెంట్ గా రిలీజ్ అయిన టీజర్, విక్రమ్ బర్త్ డే గ్లింప్స్ సినిమాపై మరింత అంచనాలను పెంచేసింది. ఇక తాజాగా ఈ చిత్ర ట్రైలర్ రిలీజ్ చేశారు మేకర్స్. రా అండ్ రస్టిక్ గా ఉన్న ఈ ట్రైలర్ లో విక్రమ్ తన నట విశ్వరూపం చూపించాడు. Also Read : ‘భారతీయుడు 2’ టికెట్ ధరల పెంపునకు తెలంగాణ ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్.. ఒక్క టికెట్ పై ఎంత పెంచారంటే? రా అండ్ రస్టిక్... ఇక ట్రైలర్ విషయానికొస్తే.. బంగారం వేటలో రెండు తెగల మధ్య పోరుతో ఆరంభమైన ట్రైలర్ ఆద్యంతం భావోద్వేగభరితంగా సాగింది. బ్రిటీష్ అధికారులు బంగారం వెలికితీత కోసం స్థానిక తెగల వారిని పనిలో పెట్టుకుంటారు. అందులో ఓ తెగ నాయకుడిగా విక్రమ్ కనిపించారు. తన వారి అస్తిత్వం కోసం ఎంతటి సాహసానికైనా సిద్ధపడే నాయకుడిగా విక్రమ్ పాత్ర శక్తివంతంగా సాగింది. విల్లు, బరిసెలు, ఈటెలతో చేసిన యాక్షన్ సీక్వెన్స్ హైలైట్గా నిలిచాయి. ట్రైలర్ లో జీవీ ప్రకాష్ కుమార్ బీజీయం ప్రధాన ఆకర్షణగా నిలించింది. మొత్తంగా 'తంగలాన్' (Thangalaan) ట్రైలర్ చూస్తుంటే విక్రమ్ కెరీర్ లో మైల్ స్టోన్ మూవీగా మిగిలిపోతుందని చెప్పొచ్చు. #chiyaan-vikram #kollywood #thangalaan-trailer మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి