Chiranjeevi: ఈ పుస్తకాన్ని రాసిన బ్రహ్మానందంకి మనస్పూర్తి గా శుభాకాంక్షలు టాలీవుడ్ సీనియర్ కమెడియన్ బ్రహ్మానందం తన ఆత్మకథను రాశారు.' నేను మీ బ్రహ్మానందం' పేరిట పుస్తకరూపంలో తీసుకువచ్చారు. ఈ నేపథ్యంలో మెగాస్టార్ చిరంజీవి బ్రహ్మానందంను అభినందించారు. తన ఇంట్లో ఆయనను శాలువా కప్పి సన్మానించారు. By Jyoshna Sappogula 28 Dec 2023 in సినిమా టాప్ స్టోరీస్ New Update షేర్ చేయండి Nenu Mee Brahmanandam: టాలీవుడ్ సీనియర్ కమెడియన్ బ్రహ్మానందం తన ఆత్మకథను రాశారు. 'నేను మీ బ్రహ్మానందం' పేరిట పుస్తకరూపంలో తీసుకువచ్చారు. ప్రస్తుతం ఈ పుస్తకం అమెజాన్, ఫ్లిప్ కార్ట్ లలో అందుబాటులో ఉంది. ఈ నేపథ్యంలో టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి బ్రహ్మానందంను అభినందించారు. తన ఇంట్లో ఆయనను శాలువా కప్పి సన్మానించారు. అంతేకాకుండా బ్రహ్మానందంతో తనకున్న అనుబంధాన్ని పంచుకుంటూ సోషల్ మీడియాలో స్పందించారు చిరంజీవి. నాకు అత్యంత ఆప్తుడు, దశాబ్దాలుగా తెలుగు ప్రేక్షకులందరికీ మహదానంద కారకుడు అయిన మనందరి బ్రహ్మానందం, తన 40 సంవత్సరాల సినీ ప్రస్థానంలో తాను కలిసిన అనేక వ్యక్తులు, పరిచయాలు,తెలుసుకున్న విషయాలు,దృష్టికోణాలు, తనకెదురైన ఎన్నో ఎన్నెన్నో జీవితానుభవాలను రంగరించి, క్రోడీకరించి ఒక ఆత్మకథగా… pic.twitter.com/0wg2p7LqNF — Chiranjeevi Konidela (@KChiruTweets) December 28, 2023 'నాకు అత్యంత ఆప్తుడు, దశాబ్దాలుగా తెలుగు ప్రేక్షకులందరికీ మహదానంద కారకుడు అయిన మనందరి బ్రహ్మానందం, తన 40 సంవత్సరాల సినీ ప్రస్థానంలో తాను కలిసిన అనేక వ్యక్తులు, పరిచయాలు,తెలుసుకున్న విషయాలు,దృష్టికోణాలు, తనకెదురైన ఎన్నో ఎన్నెన్నో జీవితానుభవాలను రంగరించి, క్రోడీకరించి ఒక ఆత్మకథగా 'నేను' అనే పుస్తకరూపంలో మనకందిoచటం ఎంతో ఆనందదాయకం. తానే చెప్పినట్టు 'ఒకరి అనుభవం,మరొకరికి పాఠ్యాంశం అవ్వొచ్చు ,మార్గదర్శకము అవ్వొచ్చు. ఈ పుస్తకం చదివే ప్రతి ఒక్కరికి స్ఫూర్తిదాయకం అవుతుందని, వెలకట్టలేని అనుభూతిని కలిగిస్తుందని నమ్ముతూ, ఈ పుస్తకాన్ని రాసిన బ్రహ్మానందంకి మనస్పూర్తి గా శుభాకాంక్షలు తెలియచేస్తూ, ఈ పుస్తక ప్రచురణ కర్తలయిన 'అన్వీక్షికి' వారిని అభినందిస్తున్నాను!' అంటూ పోస్ట్ చేశారు. #chiranjeevi #brahmanandam మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి