Chiranjeevi: తెలుగు మీడియా ఫెడరేషన్ వేడుకలు హైదరాబాద్ లో గ్రాండ్ గా జరిగాయి. ఈ ఈవెంట్ లో యూట్యూబ్ క్రియేటర్స్, సోషల్ మీడియా ఇంఫ్లూఇన్సర్ పాల్గొనగా.. మెగాస్టార్ చిరంజీవి, హీరో విజయ్ దేవకొండ (Vijay Devarakonda) ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఇందులో భాగంగా స్టార్ హీరో విజయ్ దేవరకొండ.. మెగాస్టార్ చిరంజీవిని ఇంటర్వ్యూ చేశారు. ఆయన కెరీర్, ఫ్యామిలీ లైఫ్ సంబంధించి ఆసక్తికర ప్రశ్నలు అడిగారు విజయ్.
అయితే ఈ ఇంటర్వ్యూ లో మధ్య తరగతి (Middle Class) మెంటాలిటీ గురించి విజయ్ అడిగిన ప్రశ్నకు.. మెగాస్టార్ చెప్పిన సమాధానం అందరినీ ఆకట్టుకుంటోంది. అసలు విజయ్ అడిగిన ప్రశ్న ఏంటో ఇప్పుడు తెలుసుకుందాము..
విజయ్ ప్రశ్న
విజయ్ మాట్లాడుతూ.. నేను మధ్య తరగతి కుటుంబం నుంచే వచ్చాను. ఇప్పటికీ షాంపూ అయిపోతే.. దాంట్లో నీళ్లు పోసి వాడే అలవాటు ఉంది. అలా మీకు కూడా ఏదైనా అలవాటు ఉందా అని చిరంజీవి ప్రశ్నించారు.
చూసుకోరు వెదవలు
దీనికి మెగాస్టార్ (Chiranjeevi) బదులిస్తూ.. "కొన్ని సందర్భాల్లో మా వాళ్ళు ఇంట్లో లైట్స్ ఆన్ చేసి బయటకు వెళ్లిపోతుంటారు. అలాగే గీజర్ ఆన్ చేస్తారు, మర్చిపోతారు. వాటిని నేనే ఆఫ్ చేస్తాను. వీటన్నింటికి సంబంధించి నా ఫోన్ లో ఒక యాప్ పెట్టుకున్నాను. ఈ మధ్య చరణ్ (Ram Charan) బ్యాంకాక్ వెళ్లాడు. చూస్తే తన ఫ్లోర్ లో లైట్స్ అన్నీ ఆన్‌లోనే ఉన్నాయి. చూసుకోరు వెదవలు అని.. అన్నింటినీ నేనే ఆఫ్ చేశాను. దీన్నే మిడిల్ క్లాస్ మెంటాలిటీ అంటారు. అలాగే సోప్ చివరకు వచ్చాక చిన్న చిన్న ముక్కల్ని కలిపి వాడుతుంటా. పొదుపు అనేది అవసరం అంటూ మెగాస్టార్ చెప్పిన మాటలు అందరినీ ఆకట్టుకుంటున్నాయి". ప్రస్తుతం ఈ కామెంట్స్ సోషల్ మీడియాలో తెగ వైరలవుతున్నాయి. ఇది చూసిన నెటిజన్లు.. స్టార్ హీరోగా ఎదిగినప్పటికీ తన మధ్య తరగతి మూలలను మాత్రం మర్చిపోలేదు అని మెగాస్టార్ పై ప్రశంసలు కురిపిస్తున్నారు.
Also Read: Movies : ఈ వారం థియేటర్స్ లో సందడే సందడి.. అదిరిపోయే సినిమాలు..!