/rtv/media/post_attachments/wp-content/uploads/2024/02/FotoJet-2024-02-14T190200.256-jpg.webp)
Mega star Chiranjeevi: మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం విశ్వంభర సినిమాతో బిజీగా ఉన్నారు. భోళా శంకర్, ఆచార్య తర్వాత రాబోతున్న ఈ ప్రాజెక్ట్ పై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. అయితే గత కొన్నాళ్లుగా సినిమా షూటింగ్ లో బిజీగా ఉన్న చిరంజీవి.. ఇప్పుడు కాస్త గ్యాప్ దొరకడంతో ఫ్యామిలీతో ట్రిప్ కు బయలుదేరారు. వైఫ్ సురేఖతో కలిసి వెకేషన్ ఎంజాయ్ చేయడానికి అమెరికా వెళ్తున్నారు. ఈ విషయాన్నీ మెగాస్టార్ ఆయన సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.
Also Read: Guntur Kaaram: ఓటీటీలో గుంటూరు కారం ఘాటు.. టాప్ 1 ట్రెండింగ్ గా రికార్డు
చిరంజీవి వెకేషన్ ట్వీట్
"నా బెటర్ హాఫ్ సురేఖతో కలిసి చిన్న హాలిడే వెకేషన్ కోసం అమెరికాకు వెళ్తున్నాను. వెకేషన్ నుంచి తిరిగి వచ్చిన వెంటనే విశ్వంభర షూటింగ్ ప్రారంబిస్తాను. అందరికీ హ్యాపీ వాలెంటైన్స్ డే అంటూ చిరంజీవి ట్వీట్ చేశారు". వాలెంటైన్స్ డే సందర్భంగా మెగాస్టార్ చిరంజీవి వెకేషన్ కు సంబంధించిన పోస్ట్ షేర్ చేయగా.. కోడలు ఉపాసన మరో ఇంట్రెస్టింగ్ పోస్ట్ పెట్టారు.
Off to USA for a short holiday with my better half Surekha. Will resume shoot of #Vishwambhara as soon as I get back! See you all soon! And of course Happy Valentines Day to All 💝 !! pic.twitter.com/zAAZVHjjFG
— Chiranjeevi Konidela (@KChiruTweets) February 14, 2024
ఉపాసన ఇన్స్టాగ్రామ్ పోస్ట్
మెగా కోడలు ఉపాసన వాలెంటైన్స్ డే సందర్భంగా.. కూతురు క్లింకార, భర్త రామ్ చరణ్, ఉపాసన ముగ్గురు చేతులు కలిసి ఉన్న ఫోటోను షేర్ చేస్తూ.. ఇన్ఫినిటీ లవ్ అనే సింబల్ ను జోడించారు. ఈ ఫోటోను చూసిన మెగా అభిమానులు క్యూట్ అంటూ లవ్ ఈమోజీస్ తో కామెంట్స్ పెడుతున్నారు.
View this post on Instagram
రీ ఎంట్రీ తర్వాత మెగాస్టార్ చిరంజీవి వరుస సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్నారు. రీ ఎంట్రీ తర్వాత మెగాస్టార్ చిరంజీవి వరుస సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్నారు. ఇప్పుడు బింబిసారా డైరెక్టర్ వశిష్ట మల్లాడి దర్శకత్వంలో తెరకెక్కుతున్న సోషియా ఫాంటసీ చిత్రం 'విశ్వంభర' ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. ఇక ఈ సినిమాలో కొత్త లుక్ కోసం జిమ్ లో తీవ్ర కసరత్తులు చేస్తూ కష్టపడుతున్నారు మెగాస్టార్. రీసెంట్ గా దీనికి సంబంధించిన వీడియో కూడా సోషల్ మీడియాలో తెగ వైరలైన సంగతి తెలిసిందే. ఇక ఈ సినిమాలో చిరంజీవి సరసన కథానాయికగా స్టార్ హీరోయిన్ త్రిషను నటిస్తున్నారు. UV క్రియేషన్స్ బ్యానర్ పై ప్రమోద్ ఉప్పలపాటి, వంశీ కృష్ణ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా ఈ సినిమాను విడుదల చేయడానికి మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు.
Also Read: OTT Trending Movies: ఓటీటీలో టాప్ 3 ట్రేండింగ్ మూవీస్.. చివరిలో స్థానంలో ఆ సినిమానే..!