Megastar: సలార్ మూవీపై మెగాస్టార్ రియాక్షన్ ఇదే.!

పాన్ ఇండియా రెబల్ స్టార్‌ ప్రభాస్ సినిమా సలార్ పై టాలీవుడ్ మెగాస్టార్ ప్రశంసలు కురిపించారు. సోషల్ మీడియాలో స్పందిస్తూ ప్రభాస్, సలార్ టీమ్ కు అభినందనలు తెలిపారు. సలార్ బాక్సాఫీస్ వద్ద సెగలు రేపిందని కామెంట్స్ చేశారు.

New Update
Megastar: సలార్ మూవీపై మెగాస్టార్ రియాక్షన్ ఇదే.!

Megastar Chiranjeevi: పాన్ ఇండియా రెబల్ స్టార్‌ ప్రభాస్ సినిమా సలార్ బాక్సాఫీస్ దగ్గర కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది. స్టార్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో వచ్చిన ఈ మూవీ సూపర్ హిట్ టాక్ ను సొంతం చేసుకుంది. యాక్షన్ సన్నివేశాలు, సినిమాటోగ్రఫీ సిని ప్రేక్షకులను ఫిదా చేస్తున్నాయి. టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి సైతం ఈ సినిమాపై ప్రశంసలు కురిపించారు.

Also Read: సలార్ నిర్మాతలకు షాక్.. ఆ వెబ్ సైట్లలో లీకైన మూవీ..ఇవిగో ప్రూఫ్స్.!

సలార్ మూవీపై సోషల్ మీడియాలో స్పందిస్తూ..'మైడియర్ దేవా ప్రభాస్ కు హార్ధిక అభినందనలు. సలార్ సినిమా బాక్సాఫీస్ వద్ద సెగలు రేపింది. ఘన విజయం సాధించిన దర్శకుడు ప్రశాంత్ నీల్ కు అభినందనలు. ప్రపంచ నిర్మాణంలో మీరు రాణిస్తారు. పృథ్వి, శ్రుతిహాసన్, జగపతిబాబు, చిత్ర యూనిట్ భువన్ గౌడ్, రవి బస్రూర్ , వీసీ చలపతి, నిర్మాత కిరగండూర్ లకు అభినందనలు' అంటూ ట్వీట్ చేశారు. ప్రస్తుతం ఈ ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

Advertisment
తాజా కథనాలు