Telangana: బీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌ను క‌లిసిన స్వగ్రామస్తులు.. భావోద్వేగం..!

తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్‌ను ఆయన స్వగ్రామం చింతమడక ప్రజలు కలిశారు. 9 ప్రత్యేక బస్సుల్లో వచ్చిన 540 మంది ప్రజలు ఆయనను కలిసి భావోద్వేగానికి గురయ్యారు. ఎలాంటి పరిస్థితులోనైనా తాము కేసీఆర్ వెంటే ఉంటామని చెప్పారు ప్రజలు.

New Update
Telangana: బీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌ను క‌లిసిన స్వగ్రామస్తులు.. భావోద్వేగం..!

Telangana: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల అనంతరం తొలిసారి ప్రజలను కలిశారు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్. ఆయన స్వగ్రామమైన చింతమడక నుంచి 540 మంది 9 బస్సుల్లో కేసీఆర్ ఉన్న ఎర్రవెల్లి వ్యవసాయ క్షేత్రం వద్దకు వచ్చారు. విషయం తెలుసుకున్న కేసీఆర్.. వారిని కలిశారు. గది నుంచి బయటకు వచ్చి.. తనను చూసేందుకు వచ్చిన జనాలకు అభివాదం చేశారు కేసీఆర్. ఈ సందర్భంగా చింత‌మడ‌క గ్రామ‌స్తుల‌కు అభివాదం చేశారు. కాగా, కేసీఆర్‌ను చూసిన వారు ఉద్వేగానికి లోన‌య్యారు. జై కేసీఆర్.. కేసీఆర్ నాయ‌క‌త్వం వ‌ర్ధిల్లాలి అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ఎలాంటి పరిస్థితుల్లో అయినా తామంతా కేసీఆర్ వెంటే ఉంటాని చెప్పారు. కాగా, చింతమడక గ్రామస్తులు కేసీఆర్‌ను కలిసిన సమయంలో హరీశ్ రావు, బీఆర్ఎస్ పార్టీకి చెందిన పలువురు నేతలు కూడా ఉన్నారు.

ఇటీవల జరిగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ ఓడిపోయిన విషయం తెలిసిందే. కేవలం 39 సీట్లు మాత్రమే గెలిచి, అధికారాన్ని కోల్పోయింది. బీఆర్ఎస్ పార్టీ ఓడిపోవడంతో వెంటనే ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేశారు కేసీఆర్. కాన్వాయ్, సెక్యూరిటీ ఏవీ వద్దంటూ ఒంటరిగానే తన ప్రైవేట్ కారులో ఎర్రవెల్లిలోని వ్యవసాయ క్షేత్రానికి చేరుకున్నారు.

Advertisment
తాజా కథనాలు