Pregnant : గర్భవతికి విషమిచ్చిన సహోద్యోగి.. ఎందుకో తెలిస్తే చెమటలు పడతాయి!

గర్భవతి అయిన సహోద్యోగి ప్రసూతి సెలవు తీసుకుంటే ఆఫీసులో తను ఎక్కువగా పనిచేయాల్సి వస్తుందని ఓ మహిళన చేసిన పని కలకలం రేపింది. గర్భవతి అయిన తన సహోద్యోగికి విషయం కలిపి తన బిడ్డను చంపే ప్రయత్నం చేసింది. చైనాలో ఓ ప్రభుత్వ సంస్థలో ఈ దారుణం జరిగింది.

New Update
Pregnant : గర్భవతికి విషమిచ్చిన సహోద్యోగి.. ఎందుకో తెలిస్తే చెమటలు పడతాయి!

maternity leave: గర్భవతి అయిన తన సహోద్యోగి ప్రసూతి సెలవు తీసుకుంటే ఆఫీసులో తను ఎక్కువగా పనిచేయాల్సి వస్తుందని ఓ మహిళన చేసిన పని కలకలం రేపింది. గర్భవతి అయిన తన సహోద్యోగికి విషయం కలిపి తన బిడ్డను చంపే ప్రయత్నం చేసింది.చైనాలోని హుబెయ్‌లోని ఓ ప్రభుత్వ సంస్థలో జరిగిన ఈ ఘటనపై సోషల్ మీడియాలో సర్వత్రా దుమారం రేగుతోంది.ప్రసూతి సెలవు తీసుకోకుండా సహోద్యోగి తాగే నీటిలో విషం కలిపింది. చైనా మార్నింగ్ పోస్ట్ కథనం ప్రకారం, ఈ సంఘటన హుబీ ప్రావిన్స్‌లో జరిగింది. ఎన్షి తుజియాలో ఉన్న హైడ్రాలజీ అండ్ వాటర్ రిసోర్సెస్ ఇన్వెస్టిగేషన్ బ్యూరోలో పనిచేస్తున్న ఒక మహిళ గర్భవతి. ఒకరోజు ఆమె తన డెస్క్‌లోంచి నీళ్ళు తీసుకుని తాగినప్పుడు ఈ వాటర్ రుచి వింతగా అనిపించింది.

అనుమానం వచ్చి బాటిల్ మార్చింది. అయినా కూడా నీళ్ల రుచి మాత్రం మారలేదు. ఈ విషయాన్ని తన స్నేహితులకు చెప్పగా..వారిలో ఒకరు ఆ నీళ్లలో ఏమైనా కలిపారా అంటూ సరదాగా అడిగారు. దీంతో అనుమానం వచ్చిన ఆ మహిళ తన ఐప్యాడ్ ను పరిశీలించడంతో అసలు విషయం తెలుసుకుని షాక్ అయ్యింది. సహోద్యోగి ఒకరు తన బాటిల్‌లో పౌడర్‌ కలిపడాన్ని గమనించింది. ఈ పొడి కారణంగానే ఆమెకు నీళ్లు వింత రుచిని కలిగిస్తున్నాయని తెలుసుకుంది. ఈ విషయంపై బాధిత మహిళ పోలీసులకు ఫిర్యాదు చేయడం అసలు విషయం బయటపడింది. గర్బిణి అయిన తన సహోద్యోగి ప్రసూతి సెలవులు తీసుకుంటే తనపై అదనపు పనిభారం పడుతుందన్న ఉద్దేశ్యంతోనే ఇలా చేసినట్లు సదరు మహిళ ఒప్పుకుంది.

ఈ సంఘటన మార్చి 18న జరిగింది.బ్యూరో ఆఫ్ హైడ్రాలజీ అండ్ వాటర్ రిసోర్సెస్ ఇన్వెస్టిగేషన్ అధికారులు ఈ సంఘటనను చాలా జాగ్రత్తగా వ్యవహరిస్తున్నారు. కాగా ఈ ఘటనకు పాల్పడిన మహిళా ఉద్యోగిపై చర్యలు తీసుకునే అవకాశం ఉన్నట్లు నివేదిక పేర్కొంది.

ఇది కూడా చదవండి: జైల్లోనే… కవిత బెయిల్‌ పిటిషన్‌పై విచారణ వాయిదా!

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు