China: చంద్రునిపై దిగిన చైనా ల్యాండర్‌..

చంద్రనిపై ప్రయోగాలు రోజురోజుకు పెరుగుతున్నాయి. తాజాగా చైనాకు చెందిన లూనార్ ల్యాండర్‌ చాంగే - 6 చంద్రునిపై ల్యాండ్ అయ్యింది. చైనా నేషనల్ స్పేస్ అడ్మినిస్ట్రేషన్ ఈ విషయాన్ని ప్రకటించింది.

China: చంద్రునిపై దిగిన చైనా ల్యాండర్‌..
New Update

చంద్రనిపై ప్రయోగాలు రోజురోజుకు పెరుగుతున్నాయి. తాజాగా చైనాకు చెందిన లూనార్ ల్యాండర్‌ చాంగే - 6 చంద్రునిపై ల్యాండ్ అయ్యింది. చైనా నేషనల్ స్పేస్ అడ్మినిస్ట్రేషన్ ఈ విషయాన్ని ప్రకటించింది. చైనా కాలమాన ప్రకారం ఆదివారం ఉదయం చంద్రునిపై మనకు కనిపించని అవతలి వైపు అయిట్కిన్‌ బేసిన్‌ అని పిలిచే ప్రాంతంలో సురక్షితంగా దిగినట్లు పేర్కొంది.

Also read: పదేళ్ల తెలంగాణ.. ఉద్యమ ఆకాంక్ష నెరవేరిందా?

మరో విషయం ఏంటంటే ఈ చాంగే - 6 లూనర్‌ ల్యాండర్‌.. చంద్రునిపై శాంపిల్స్‌ తీసుకొని తిరిగి భూమికి చేరనుంది. మే 3న చాంగే -6ను ప్రయోగించారు. 53 రోజుల పాటు ప్రయాణించిన అనతంరం ఇది చంద్రునిపై అడుగుపెట్టింది. అందులో ఉన్న రోబోల సాయంతో చంద్రునిపై తవ్వకాలు జరిపి ఏకంగా రెండు కిలోల మట్టి శాంపిల్స్‌ను సేకరించి భూమిపైకి తీసుకురానుంది.

అయితే లూనార్ ల్యాండర్‌లో ఉన్న అసెండర్ మాడ్యూల్‌.. చంద్రుని పైనుంచి లేచి చంద్రుడి కక్ష్యలో తిరుగుతున్న ఆర్టిటర్‌తో అనుసంధానించబడుతుంది. ఆ తర్వాత మళ్లీ ఆర్బిటర్.. భూమి దిశగా ప్రయాణిస్తుంది. అలాగే ఆర్బిటర్‌లో ఉన్న రీఎంటట్రీ మాడ్యూల్ శాంపుల్స్‌ తీసుకొని భూమిపై ల్యాండ్ అవుతుంది.

Also read:  వరంగల్ ఎంపీ స్థానం వారిదే.. RTV సంచలన రిపోర్ట్

#telugu-news #china
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe