China earthquake: చైనాలో ఆల్‌ అవుట్ ఆపరేషన్‌ కు పిలుపునిచ్చిన జిన్‌పింగ్‌!

చైనాలోని గన్సు ప్రావిన్స్‌లో సోమవారం అర్థరాత్రి సంభవించిన భూకంపం భారీ విధ్వంసం సృష్టించింది.దీని తీవ్రత రిక్టర్ స్కేలుపై 6.2గా అధికారులు వివరించారు. శిథిలాల కింద చిక్కుకున్న వారిని రక్షించేందుకు చైనా అధ్యక్షుడు జిన్‌ పింగ్‌ ఆలౌట్‌ ఆపరేషన్‌ కు ఆదేశాలు జారీ చేశారు.

China earthquake: చైనాలో ఆల్‌ అవుట్ ఆపరేషన్‌ కు పిలుపునిచ్చిన జిన్‌పింగ్‌!
New Update

చైనా (China)లో సోమవారం రాత్రి భారీ భూకంపం విధ్వంసం సృష్టించింది. భూకంపం మిగిల్చిన విషాదంలో ఇప్పటి వరకు అధికారిక లెక్కల ప్రకారం..118 మంది మృతి చెందగా కొన్ని వందల మంది గాయపడినట్లు సమాచారం. భారీ ప్రకంపనల ధాటికి కొన్ని భవనాలు పూర్తిగా దెబ్బతినగా..మరికొన్ని భవనాలు నిలువునా కూలిపోయాయి.

ఆ భవనాల శిథిలాల కింద ఎంతో మంది ఉన్నట్లు అధికారులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలోనే చైనా అధ్యక్షుడు జిన్‌ పింగ్ అధికారులకు ఆలౌట్ ఆపరేషన్‌ కు పిలుపునిచ్చారు. సోమవారం రాత్రి 11.59 నిమిషాలకు వాయువ్య చైనాలోని గన్సు, కింగ్‌ హై ప్రావిన్స్‌ లలో భూకంపం సంభవించింది.

ఈ భూకంపం తీవ్రత రిక్టర్‌ స్కేలు పై 6.2 గా నమోదైనట్లు నేషనల్‌ సెంటర్‌ ఫర్‌ సిస్మోలజి తెలిపింది. ఇప్పటి వరకు 118 మంది మరణించినట్లు అధికారులు వెల్లడించారు. ప్రజల ప్రాణాలు, ఆస్తులను రక్షించేందుకు తీసుకోవాల్సిన అన్ని సహాయక చర్యలను చేపట్టాలని అధికారులను జిన్‌పింగ్‌ ఆదేశించారు.

మృతుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉందని చెబుతున్నారు.భూకంపం తాకిడికి చాలా ఇళ్లు కూలిపోయాయి. మరికొన్నింటికి బీటలు వచ్చాయి. ప్రజలకు సోమవారం రాత్రి కాళరాత్రిలా మారింది. వేలాది మంది రాత్రంతా నిద్రలేకుండానే రోడ్లపై, వీధుల్లో ఉన్నారని రాష్ట్ర న్యూస్ ఏజెన్సీ తెలిపింది. చాలా చోట్ల, నీరు, కరెంటు సరఫరా కూడా నిలిచిపోయింది. ఘటనపై స్పందించిన చైనా అధ్యక్షుడు జి జిన్‌పింగ్..సహాయ చర్యలను చేపట్టాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.

భూమిలోపల పొరల్లో ఖాళీలు ఎక్కువగా ఉన్నాయి. దీని వల్లే ఈ భూకంపం వచ్చిందనే అంచనాలు ఉన్నాయి. భూకంపానికి సంబంధించిన ఫోటోలు, వీడియోలను సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

Also read: వైసీపీలో హైవోల్టేజ్‌ ఎన్నికల హీట్‌..తాడేపల్లి నుంచి మరికొందరికి పిలుపు!

#jinping #china #earthquake
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe