China Population : భారీగా తగ్గిన చైనా జనాభా...2023లో భారీగా మరణాలు నమోదు..!!

2023లో చైనా జనాభా 20లక్షలు క్షీణించింది. కొన్నేళ్లుగా కొనసాగుతున్న తక్కువ జననాల సమస్యతోపాటు గతేడాది మరణాలు అధికం సంభవించాయి. దీంతో జనాభా భారీగా పడిపోయింది. వ్రుద్ధుల జనాభా క్రమంగా పెరగడం..పనిచేసే సామర్థ్యం ఉన్న జనాభా తగ్గుతోంది.

China Population : భారీగా తగ్గిన చైనా జనాభా...2023లో భారీగా మరణాలు నమోదు..!!
New Update

China Population:  చైనా జనాభా వరుసగా రెండవ ఏడాది భారీగా క్షీణించింది. జననాలతో పోల్చిస్తే మరణాలు అధికంగా నమోదు అవుతున్నాయి. దీంతో 2023లో జనాబా 20లక్షల మేర తగ్గింది. కోవిడ్ ఆంక్షలు(Covid Restrictions) ఎత్తేయడం వల్ల మరణాలు పెరిగినట్లు అక్కడి ప్రభుత్వ గణాంకాలు పేర్కొన్నాయి. అంతుకుముందు ఏడాదితో పోల్చితే మొత్తం మరణాల సంఖ్య (Number of deaths)రెట్టింపు అయ్యింది. 2023లో ఏకంగా 6లక్షల 90వేల మరణాలు సంభవించినట్లు గణాంకాలు చెబుతున్నాయి. 2022 చివరిలో మొదలైన కోవిడ్ తీవ్రత 2023 ఫిబ్రవరి వరకు కొనసాగింది. ఈ కాలంలో మరణాలు భారీగా పెరిగినట్లు చైనా తెలిపింది. దేశం మొత్తం జనాభా 140కోట్లుగా ఉన్నట్లు గణాంక కార్యాలయం(Statistical Office) వెల్లడించింది.

చైనా బ్యూరో ఆఫ్ స్టాటిస్టిక్స్ (China Bureau of Statistics)ప్రకారం దేశంలో మొత్తం జనాభా 1.4 బిలియన్లు. కోవిడ్ -19 వ్యాప్తి కారణంగా మరణాల సంఖ్య గణనీయంగా పెరుగుతుందని జనాభా శాస్త్రవేత్తలు భయపడ్డారు. జననాల రేటు క్షీణించడం చాలా కాలంగా చైనాకు ఆర్థిక, సామాజిక సవాలుగా ఉంది. చైనా సగటు జనాభా వృద్ధాప్యం పెరుగుతోంది, ఇది శ్రామికశక్తి క్షీణతకు దారి తీస్తుంది. కాలక్రమేణా ఆర్థిక వృద్ధి మందగిస్తుందని తెలిపింది.

ఒక బిడ్డ విధానం' చైనాను ముంచింది:
పెద్ద సంఖ్యలో ఉన్న వృద్ధులకు సేవలను అందించే దేశ సామర్థ్యానికి ఇది సవాలుగా మారవచ్చు. జననాల రేటు వరుసగా ఏడవ సంవత్సరం తగ్గింది కానీ గత సంవత్సరాలతో పోలిస్తే ఈసారి ఈ తగ్గుదల తక్కువగా ఉంది. గతేడాది 90 లక్షల మంది పిల్లలు జన్మించారు. 'ఒకే బిడ్డ' అనే విధానాన్ని అవలంబించడం ద్వారా జనాభా పెరుగుదలను నియంత్రించడానికి చైనా ప్రయత్నించింది. కానీ ఇప్పుడు అది భిన్నమైన సమస్యను ఎదుర్కొంటోంది.

ప్రభుత్వం 2016లో అధికారికంగా తన విధానాన్ని ముగించినప్పటి నుండి జననాలను ప్రోత్సహించడానికి ప్రయత్నించింది. కానీ పెద్దగా విజయం సాధించలేదు. ప్రజలు ఆలస్యంగా వివాహం చేసుకుంటున్నారు. చాలామంది పిల్లలు వద్దనే నిర్ణయం తీసుకుంటున్నారు. ఇవేకాకుండా చదువు, పోషణ ఖర్చులు ఎక్కువగా ఉండడంతో ఒకే బిడ్డ అనే విధానాన్ని చాలా మంది అనుసరిస్తున్నారు.దీంతో చైనాలో భారీగా జనాభా తగ్గేందుకు కారణం అవుతోంది.

ఇది కూడా చదవండి: టాటా పంచ్ ఈవీ వచ్చేసింది…ఒక్కసారి ఛార్జ్ చేస్తే..421కి.మీ దూసుకుపోవచ్చు..!!

#china-news #china-population #chinas-population #chinas-population-is-shrinking #world-population
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe