చెన్నైలో ప్రారంభం కానున్న చైనా లీప్‌మోటర్‌ ఎలక్ట్రిక్‌ కార్ల తయారీ..!

ప్రపంచంలోని మూడో అతిపెద్ద కార్ల తయారీ సంస్థ స్టెల్లార్టిస్ త్వరలో చెన్నైలో పెట్టుబడులు పెడుతున్నట్లు తెలిపింది ఈ విషయాన్ని ఆ సంస్ధ సీఈవో కార్లోస్ తవారెస్ తెలిపారు.

చెన్నైలో ప్రారంభం కానున్న చైనా లీప్‌మోటర్‌ ఎలక్ట్రిక్‌ కార్ల తయారీ..!
New Update

భారతదేశంలో ఎలక్ట్రిక్ వాహనాల ఉత్పత్తిని ప్రోత్సహించడానికి కేంద్ర ప్రభుత్వ కొత్త ఎలక్ట్రిక్ వాహన విధానం వెనుక టెస్లా  చర్చలు ప్రధాన కారణంగా కనిపిస్తుంది. ఈ విధానం టెస్లాకు ఉపయోగపడిన,పడకపోయిన ఇతర ప్రముఖ కంపెనీలకు పెద్ద ఎత్తున ఉపయోగపడుతుంది.ప్రపంచంలోని మూడో అతిపెద్ద కార్ల తయారీ సంస్థ స్టెల్లార్టిస్ త్వరలో చెన్నైలో పెట్టుబడులు పెడుతున్నట్లు తెలిపింది.

క్రిస్లర్, సిట్రోయెన్, ఫియట్, జీప్‌తో సహా పలు ప్రముఖ బ్రాండ్‌లను కలిగి ఉన్న స్టెల్లాంటిస్ గ్రూప్ ఇటీవలే చైనాకు చెందిన లీప్‌మోటర్‌లో భారీగా పెట్టుబడులు పెట్టి, వాటాను కొనుగోలు చేసింది. చైనీస్ ఆటోమొబైల్ కంపెనీలు భారతదేశంలో పెట్టుబడులు పెట్టడానికి కష్టపడుతుండగా, చైనాకు చెందిన లీప్‌మోటార్ ప్రత్యామ్నాయ ఆలోచనతో స్టెల్లాండిస్‌తో పొత్తు పెట్టుకుంది. సరసమైన ధరలో ఎలక్ట్రిక్ కార్లను తయారు చేసేందుకు ఈ కూటమి ప్రధాన కార్యాలయం చెన్నైలో ఉంటుంది. భారతదేశంలో హై-ఎండ్ ఎలక్ట్రిక్ కార్ల దేశీయ ఉత్పత్తిలో పెట్టుబడిని ప్రోత్సహించడానికి భారతదేశం మార్చి 15న కొత్త విధానాన్ని ప్రకటించింది.

పాలసీ ప్రకారం, కంపెనీలు కనీసం 500 మిలియన్ డాలర్ల పెట్టుబడితో దేశీయ ఉత్పత్తిని ప్రారంభిస్తే కనీసం 35,000 డాలర్ల (రూ. 29.2 లక్షలు) విలువైన ఎలక్ట్రిక్ వాహనాలను దిగుమతి చేసుకోవడానికి ఐదేళ్లపాటు 15% దిగుమతి సుంకం రాయితీ ఇవ్వబడుతుంది. లీప్‌మోటర్ ఇప్పుడు భారతదేశంలో సరసమైన ఎలక్ట్రిక్ కార్లను విక్రయించాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఇది భారతదేశంలో ఎలక్ట్రిక్ కార్లను తయారు చేసే టాటా మోటార్స్, మహీంద్రాపై పెద్ద ప్రభావం చూపుతుందని భావిస్తున్నారు. స్టెల్లాండిస్ ఇప్పటికే తిరువళ్లూరులో సిట్రోయెన్ బ్రాండ్‌తో ఎలక్ట్రిక్ కార్లను తయారు చేస్తోంది. భారతదేశంలోని అనేక కంపెనీలకు eC3 కార్ మోడళ్లను విక్రయించిందని డేవర్స్ చెప్పారు

భారతదేశం కొత్త ఎలక్ట్రిక్ వాహన విధానం స్టెల్లార్టిస్ వంటి ప్రపంచ కార్ల తయారీదారులను ఆకర్షిస్తోంది. లీప్‌మోటర్‌తో భాగస్వామ్యంతో, స్టెల్లాంటిస్ దేశీయంగా సరసమైన ఎలక్ట్రిక్ వాహనాలను తయారు చేయాలని యోచిస్తోంది. ఈ చర్య భారతదేశంలో ఎలక్ట్రిక్ వాహనాల మార్కెట్‌ను విస్తరించడానికి విద్యుత్ రవాణాను ప్రోత్సహించడంలో సహాయపడుతుంది. అదేవిధంగా చైనా కూడా ఈ కూటమి ద్వారా భారత్‌లోకి ప్రవేశించింది.

#chennai #china #electric-car
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి