జాబిల్లి యాత్రలో చైనా మరో రికార్డు సృష్టించింది. ప్రపంచ చరిత్రలోనే తొలిసారిగా చంద్రుని ఆవలివైపు నుంచి మట్టి నమూనాలను సేకరించి.. వాటిని విజయవంతంగా భూమి పైకి తీసుకొచ్చిన మొదటి దేశంగా చరిత్ర సృష్టించింది. చాంగే-6 వ్యోమనౌక మే 3న భూమి నుంచి బయలుదేరింది. జూన్ 2న చంద్రడి దక్షిణ ధృవంలోని అయిట్కిన్ బేసిన్‌లో దిగింది. ఇప్పటివరకు ఏ దేశం కూడా దక్షిణ ధృవాన్ని అన్వేషించలేదు. అక్కడ మట్టి నమూనాలను సేకరించిన చాంగే-6 వ్యోమనౌక.. మంగళవారం తిరిగి భూమిపైకి చేరుకుంది. ఈ యాత్రను విజయవంతంగా నిర్వహించిన శాస్త్రవేత్తలను చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్ అభినందించారు.
Also Read: ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన పెళ్లి, వెడ్డింగ్ డ్రెస్ ధరెంతో తెలుసా!
స్థానిక కాలమాన ప్రకారం మంగళవారం మధ్యాహ్నం 2.07 గంటలకు చాంగే -6లోని రిటర్నర్ క్యాప్సూల్స్.. ఉత్తర చైనాలోని ఇన్నర్ మంగోలియన్ ప్రాంతంలో పారాచూట్ల సాయంతో సురక్షితంగా కిందకి దిగింది. ఇందులో దాదాపు 2 కిలోల వరకు జాబిల్లి నమునాలు ఉండొచ్చని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. ఈ క్యాప్సూల్స్‌ను వాయుమార్గంలో బీజింగ్‌కు తరలించి.. అక్కడ దీన్ని తెరుస్తారు. ఆ తర్వాత శాస్త్రవేత్తల బృందానికి అప్పగిస్తారు. ఈ మట్టి నమూనాలతో చంద్రుడి పుట్టుక గురించి మరిన్ని కొత్త వివరాలు బయటపడతాయని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.
Also Read: ఒక్కసారిగా 21 వేల అడుగుల కిందికి విమానం.. ప్రయాణీకులకు తీవ్ర గాయాలు