China: చరిత్ర సృష్టించిన చైనా.. చంద్రుని ఆవలివైపు మట్టితో తొలిసారిగా భూమిపైకి ప్రపంచ చరిత్రలోనే తొలిసారిగా చంద్రుని ఆవలివైపు నుంచి మట్టి నమూనాలను సేకరించి.. వాటిని విజయవంతంగా భూమి పైకి తీసుకొచ్చిన మొదటి దేశంగా చైనా చరిత్ర సృష్టించింది. చాంగే-6 వ్యోమనౌక మే 3న భూమి నుంచి బయలుదేరి.. చివరికి జూన్ 25 మట్టి నమూనాలతో భూమిపైకి విజయవంతంగా చేరుకుంది. By B Aravind 26 Jun 2024 in ఇంటర్నేషనల్ రాజకీయాలు New Update షేర్ చేయండి జాబిల్లి యాత్రలో చైనా మరో రికార్డు సృష్టించింది. ప్రపంచ చరిత్రలోనే తొలిసారిగా చంద్రుని ఆవలివైపు నుంచి మట్టి నమూనాలను సేకరించి.. వాటిని విజయవంతంగా భూమి పైకి తీసుకొచ్చిన మొదటి దేశంగా చరిత్ర సృష్టించింది. చాంగే-6 వ్యోమనౌక మే 3న భూమి నుంచి బయలుదేరింది. జూన్ 2న చంద్రడి దక్షిణ ధృవంలోని అయిట్కిన్ బేసిన్లో దిగింది. ఇప్పటివరకు ఏ దేశం కూడా దక్షిణ ధృవాన్ని అన్వేషించలేదు. అక్కడ మట్టి నమూనాలను సేకరించిన చాంగే-6 వ్యోమనౌక.. మంగళవారం తిరిగి భూమిపైకి చేరుకుంది. ఈ యాత్రను విజయవంతంగా నిర్వహించిన శాస్త్రవేత్తలను చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్ అభినందించారు. Also Read: ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన పెళ్లి, వెడ్డింగ్ డ్రెస్ ధరెంతో తెలుసా! స్థానిక కాలమాన ప్రకారం మంగళవారం మధ్యాహ్నం 2.07 గంటలకు చాంగే -6లోని రిటర్నర్ క్యాప్సూల్స్.. ఉత్తర చైనాలోని ఇన్నర్ మంగోలియన్ ప్రాంతంలో పారాచూట్ల సాయంతో సురక్షితంగా కిందకి దిగింది. ఇందులో దాదాపు 2 కిలోల వరకు జాబిల్లి నమునాలు ఉండొచ్చని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. ఈ క్యాప్సూల్స్‌ను వాయుమార్గంలో బీజింగ్‌కు తరలించి.. అక్కడ దీన్ని తెరుస్తారు. ఆ తర్వాత శాస్త్రవేత్తల బృందానికి అప్పగిస్తారు. ఈ మట్టి నమూనాలతో చంద్రుడి పుట్టుక గురించి మరిన్ని కొత్త వివరాలు బయటపడతాయని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. Also Read: ఒక్కసారిగా 21 వేల అడుగుల కిందికి విమానం.. ప్రయాణీకులకు తీవ్ర గాయాలు Touchdown! Chang'e-6 carrying lunar samples from the Moon's far side, for the first time, safely lands in Inner Mongolia https://t.co/I6ToMAjEb4 pic.twitter.com/jzz2tLrXo0 — China 'N Asia Spaceflight 🚀𝕏 🛰️ (@CNSpaceflight) June 25, 2024 #moon #moon-sand-samples #china మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి