China: 'పిల్లల్ని కనండి ప్లీజ్..' మహిళలను బుజ్జగిస్తోన్న చైనా అధ్యక్షుడు! చైనాలో జననాల కంటే మరణాలు పెరుగుతున్న విషయం తెలిసిందే. 1961తర్వాత తొలిసారి జనాభా తగ్గుదలను చవిచూసిన చైనా పిల్లల్ని కనండి మహాప్రభో అని మొత్తుకుంటోంది. దేశ జనాభాలో యువత శాతం తగ్గిపోవడమే దీనికి కారణం. సాక్ష్యాత్తు దేశ అధ్యక్షుడు జిన్‌పింగే మహిళలకు కీలక సూచనలు చేశారంటే అక్కడి పరిస్థితి ఎంత దారుణంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. కుటుంబ సామరస్యం బట్టి మహిళల ఎదుగుదలను చూడాలంటూ జిన్‌పింగ్ కామెంట్స్ చేశారు. By Trinath 31 Oct 2023 in ఇంటర్నేషనల్ టాప్ స్టోరీస్ New Update షేర్ చేయండి ఏ దేశానికైనా యువతే బలం. ఎక్కడ యవత శాతం ఎక్కువ ఉంటుందో ఆ దేశానికి ప్రొడక్టివిటీ మెరుగ్గా ఉంటుందన్నది అందరికి తెలిసిన విషయమే. అంటే అభివృద్ధిలో దూసుకుపోవాలంటే యువతే కీలకం. ప్రపంచలోని అగ్రరాజ్యాల్లో ఒకటిగా పేరొందిన చైనాకు ప్రస్తుతం గడ్డుకాలం నడుస్తోంది. ఒకప్పుడు జనాభా పెరుగుదల వారికి శాపంగా అనిపించగా.. ఇప్పుడు తగ్గుదల శాపంగా అనిపిస్తోంది. ప్రపంచంలోనే ఎక్కువ జనాభా కలిగిన దేశంగా నిలిచిన చైనా ప్రస్తుతం రెండో స్థానంలో ఉంది. ఒకటి నుంచి రెండుకు తగ్గితే ఆనందపడాల్సిన చైనా ప్రస్తుతం బాధ పడుతోంది. జనాభా నియంత్రణ పేరుతో గతంలో తీసుకున్న కఠిన నిర్ణయాలు ఇప్పుడు ఆ దేశ అభివృద్ధిపైనే నెగిటివ్ ఎఫెక్ట్ చూపిస్తున్నాయి. అందుకే పిల్లల్ని కనండి మహాప్రభో అని అక్కడి అధ్యక్షుడే మొత్తుకుంటున్నారు. 1979 తర్వాత ఒకరి కంటే ఎక్కువ మంది పిల్లల్ని కంటే కఠిన శిక్షలు విధించిన చైనా జిన్‌పింగ్ ఏం అన్నారంటే? ఆల్ చైనా విమెన్స్ ఫెడరేషన్ సమావేశంలో చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్ చేసిన వ్యాఖ్యలు తీవ్ర చర్చనీయాంశమవుతున్నాయి. కేవలం చైనాలోనే కాకుండా డ్రాగన్ అడుగులను గమనించే ఇతర దేశాలు సైతం జిన్‌పింగ్ వ్యాఖ్యలపై లోతుగా ఆలోచిస్తున్నాయి. దేశ పురోగతిలో మహిళల పాత్ర కీలకమైనదన్నారు జిన్‌పింగ్. ఆఫీస్‌ల్లో మహిళల పనితీరు ఆధారంగానే వారి ఎదుగుదలను చూడకూడదని.. కుటుంబ సామరస్యం, సామాజిక సామరస్యం బట్టి అంచనా వేయాలన్నారు జిన్‌పింగ్. పెళ్లి, పిల్లలను కనే కొత్త సంస్కృతిని పెంపొందించాలని చెప్పారు. ఆడపిల్లలపై చైనా వివక్ష జిన్‌పింగ్ ఎందుకిలా చెప్పారు? 1961 తర్వాత చైనా జనాభా తొలిసారిగా పడిపోయింది. ఇక గతేడాది తొలిసారిగా జననాల కంటే మరణాలు కూడా పెరిగాయి. 1976 తర్వాత అత్యధిక మరణాల రేటును నమోదైంది. చైనా ప్రభుత్వం 1980ల్లో జనాభా పెరుగుదలను నియంత్రించడానికి బలవంతపు అబార్షన్లు చేయించింది. 1979లో చైనా ప్రభుత్వం వివాదాస్పద వన్-చైల్డ్ పాలసీని ప్రవేశపెట్టింది. ఈ పాలసీని చాలా స్ట్రిక్ట్‌గా అమలు చేసింది. నిబంధనలను ఉల్లంఘించిన కుటుంబాలకు జరిమానా విధించడంతోపాటు కొన్ని సందర్భాల్లో ఉద్యోగాల నుంచి కూడా తీసేశారు. ఒకరి కంటే ఎక్కువ మంది పిల్లల్ని కనిన వారికి శిక్షలు విధించారు. ముఖ్యంగా ఆడపిల్లల విషయంలో చైనా పాలకుల వివక్ష ఘోరంగా ఉండేది. 2016లో వన్-చైల్డ్ పాలసీకి మంగళం పాడిన చైనా సర్కార్ ఇద్దరని కనండి ప్లీజ్: వన్-చైల్డ్ పాలసీ కారణంగా చైనాలో జనాభా పెరుగుదల తగ్గిన మాట నిజమే కానీ.. యువత పాపులేషన్ తగ్గిపోయింది. దీంతో చైనా సర్కార్‌కు కష్టకాలం మొదలైంది. అందుకే 2016లో వన్-చైల్డ్ పాలసీని రద్దు చేశారు. పెళ్లయిన జంటలు ఇద్దరు పిల్లలను కనేందుకు అనుమతించారు. అయితే చైనా యువతలో పెళ్లిపై ఇంట్రెస్ట్ తగ్గుతూ వచ్చింది. అందులోనూ ఖర్చులు పెరగడం, ఆర్థిక సమస్యలతో చాలా మంది యువత పెళ్లి చేసుకోవడానికి అసలు ఇష్టపడడంలేదు. పెళ్లి చేసుకొని పిల్లల్ని కన్న వారికి ప్రభుత్వంతో పాటు పలు ఏజెన్సిలు బంపర్‌ఆఫర్లు ప్రకటించినా లాభం లేకపోయింది. సంతానోత్పత్తిని పెంచడం ఇప్పుడు చైనా సర్కార్ ముందు ఉన్న అతి పెద్ద సవాల్. అధికారులు చేస్తున్న ప్రయత్నాలు ఫలించకపోవడంతో, యువతలో మార్పు రావడం లేదని గమనించిన జిన్‌పింగ్ తానే స్వయంగా మహిళలకు సూచనలు ఇస్తుండడం చూస్తుంటే డ్రాగన్ సర్కార్ ఎన్ని ఇబ్బందులు పడుతుందో అర్థం చేసుకోవచ్చు. Also Read: సచిన్ విగ్రహం ప్రారంభోత్సవం.. నిజంగా దేవుడే భయ్యా! #xi-jinping #china-population మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి