Bharat : భద్రతా బలగాలకు మరో కొత్త సవాల్... ఉగ్రవాదుల చేతుల్లో చైనా 'అల్ట్రా సెట్'!

గత కొంతకాలం నుంచి జమ్మూ కశ్మీర్‌ లో ఉగ్రవాదుల చర్యలు ఎక్కువ అయ్యాయి.భద్రతా బలగాలు జరిపిన కాల్పుల్లో చనిపోయిన ఉగ్రవాదుల వద్ద అత్యాధునిక టెలి కమ్యూనికేషన్‌ అల్ట్రాసెట్‌ దొరకడంతో పరిస్థితులు విషమంగా ఉన్నాయని అధికారులు భావిస్తున్నారు.

New Update
Bharat : భద్రతా బలగాలకు మరో కొత్త సవాల్... ఉగ్రవాదుల చేతుల్లో చైనా 'అల్ట్రా సెట్'!

China Made Ultra Set : గత కొంతకాలం నుంచి జమ్మూ కశ్మీర్‌ (Jammu & Kashmir) లో ఉగ్రవాదుల (Terrorists) చర్యలు ఎక్కువ అయ్యాయి. అతి తక్కువ కాలంలోనే పలు ఉగ్రదాడులు జరిగాయి. అయితే భద్రతా బలగాలు జరిపిన కాల్పుల్లో చనిపోయిన ఉగ్రవాదుల వద్ద అత్యాధునిక టెలి కమ్యూనికేషన్‌ అల్ట్రాసెట్‌ దొరకడంతో పరిస్థితులు విషమంగా ఉన్నాయని అధికారులు భావిస్తున్నారు.

ఈ అల్ట్రాసెట్‌ అనేది చైనా (China) తయారీ కమ్యూనికేషన్ పరికరం కావడంతో పలు అనుమానాలు రేకెత్తిస్తున్నాయి. ఈ పరికరాలను చైనా… పాక్ సైన్యానికి అందించింది. వీటి ద్వారా శత్రు దేశాల ఎలక్ట్రానిక్ నిఘా వ్యవస్థలకు దొరక్కుండా సమాచారం మార్చుకోవచ్చు. ఇప్పుడీ అల్ట్రా సెట్ పరికరాలు ఉగ్రవాదుల చేతుల్లోకి రావడం భారత భద్రతా బలగాలను ఆందోళనకు గురిచేస్తోంది.

ఏప్రిల్ 25న జమ్మూకశ్మీర్ లోని సోపోర్ లో ఇద్దరు టెర్రరిస్తులు భద్రతబలగాల చేతిలో హతం కాగా… పూంచ్ జిల్లా ఎన్ కౌంటర్ లో మరో నలుగురు విదేశీ మిలిటెంట్లు మృతి చెందారు. ఈ ఆరుగురి వద్ద అల్ట్రా సెట్లు (Ultra Sets) ఉన్నట్లు అధికారులు గుర్తించారు.

Also read: నేడు తొలిసారి సమావేశం కానున్న ఏపీ కేబినేట్!

Advertisment
తాజా కథనాలు