China:సూపర్ ఫాస్ట్ ఇంటర్నెట్ నెట్ వర్క్ ను ఆవిష్కరించిన చైనా

టెక్నాలజీలో రాకెట్ స్పీడ్ తో దూసుకుపోతోంది చైనా. ఇప్పటికే ప్రపంచ దేశాల కన్నా ఎంతో ముందు ఉన్న చైనా ఇప్పుడు మరో అడుగు ముందుకు వేసింది. వరల్డ్ లోనే అత్యంత వేగవంతమైన ఇంటర్నెట్ నెట్ వర్క్ ను ఆవిష్కరించింది.

China:సూపర్ ఫాస్ట్ ఇంటర్నెట్ నెట్ వర్క్ ను ఆవిష్కరించిన చైనా
New Update

సాంకేతిక అభివృద్ధి విషయంలో చైనా మరో సంచలనానికి తెరతీసింది. ప్రపంచంలోని అత్యంత వేగవంతమైన ఇంటర్నెట్ నెట్‌వర్క్‌ను చైనా తెరపైకి తీసుకు వచ్చింది. సెకనుకు 1.2 టెరాబైట్‌ డేటాను ప్రసారం చేయగల సామర్ధ్యం దీని సొంతమని సౌత్ చైనా మార్నింగ్ పోస్ట్ కథనం చెప్పింది. ఇప్పుడు ప్రపంచంలో ఉన్న ఇంటర్నెట్ స్పీడ్ కన్నా పదింతలు వేగవంతమైనది. ఈ ప్రాజెక్ట్‌ను చైనాలోని సింఘువా యూనివర్శిటీ, చైనా మొబైల్, హువాయ్ టెక్నాలజీస్, సెర్నెట్ కార్పొరేషన్ సంయుక్తంగా చేపట్టాయి.

Also Read: పుష్ప-2 మామూలుగా ఉండదు అంటున్న డీఎస్పీ

3,000 కిలోమీటర్లకు పైగా ఈ నెట్‌వర్క్ చైనాలో విస్తరించి ఉంది. ఇది బీజింగ్, వుహాన్, గ్వాంగ్జూలను విస్తృతమైన ఆప్టికల్ ఫైబర్ కేబులింగ్ సిస్టమ్ ద్వారా అనుసంధానం చేస్తుంది. సెకనుకు 1.2 టెరాబైట్‌ల డేటాను ప్రసారం చేసే సామర్థ్యాన్ని కలిగి ఉంది. ఇప్పటికి ఇదే హైయ్యెస్ట్ పొటెన్షియల్ కలిగినది. అమెరికా ఇటీవలే సెకనుకు 400 గిగాబైట్ల వేగంతో 5జీ ఇంటర్నెట్‌ను ఆవిష్కరించింది.

ముఖ్యంగా బీజింగ్-వుహాన్-గ్వాంగ్జూ కనెక్షన్ చైనా భవిష్యత్తు ఇంటర్నెట్ టెక్నాలజీ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌లో భాగం. దీని కోసం జాతీయ చైనా ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ నెట్‌వర్క్ దశాబ్దం పాటు కృషి చేసింది. జులైలో యాక్టివ్ చేసిన ఈ ప్రాజెక్టును సోమవారం అధికారికంగా ప్రారంభించారు. నెట్‌వర్క్ అన్ని ఆపరేషనల్ పరీక్షలను విజయవంతంగా పూర్తిచేసుకుని సమర్ధవంతంగా పని చేస్తోందని అధికారులు చెబుతున్నారు. హువాయి టెక్నాలజీస్ వైస్-ప్రెసిడెంట్ వాంగ్ లీ మాట్లాడుతూ.. నెట్‌వర్క్ నిజంగా ఎంత వేగంగా ఉందో అర్థం చేసుకోవడానికి ఇదో ఉదాహరణ అని అన్నారు. ఇది కేవలం ఒక సెకనులో 150 హై-డెఫినిషన్ ఫిల్మ్‌లకు సమానమైన డేటాను బదిలీ చేయగల సామర్థ్యాన్ని కలిగి ఉంది అని వివరించారు.

Also read:సెమీస్ సమరంలో భారత్-న్యూజిలాండ్ – లైవ్ అప్డేట్స్

#china #internet #network #super-fast
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe