Priest: వారసత్వ అర్చకత్వాన్ని పునరుద్ధరించండి.. డిప్యూటీ సీఎంకు రంగరాజన్ వినతి

వారసత్వ అర్చకత్వాన్ని పునరుద్ధరించాలని చిలుకూరు బాలాజీ ఆలయ ప్రధాన అర్చకులు సీఎస్ రంగరాజన్ తెలంగాణ ప్రభుత్వాన్ని కోరారు. వంశపారంపర్యంగా అర్చకత్వాన్నే నమ్ముకున్నామని, తమ సమస్యలు తీర్చాలంటూ ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్కకు గురువారం వినతులు ఇచ్చారు.

New Update
Priest: వారసత్వ అర్చకత్వాన్ని పునరుద్ధరించండి.. డిప్యూటీ సీఎంకు రంగరాజన్ వినతి

Telangana: వారసత్వ అర్చకత్వాన్ని పునరుద్ధరించాలని చిలుకూరు బాలాజీ ఆలయ ప్రధాన అర్చకులు సీఎస్ రంగరాజన్ తెలంగాణ ప్రభుత్వాన్ని కోరారు. వంశపారంపర్యంగా అర్చకత్వాన్నే నమ్ముకున్నామని, కావున అర్చకుల సమస్యలను తీర్చాలంటూ ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్కకు గురువారం వినతులు ఇచ్చారు. ఈ మేరకు భద్రాద్రి, వేములవాడ, బాసర వంటి ప్రాచీన దేవాలయాల్లో వారసత్వ అర్చకుల సమస్యలు పెండింగ్ లో ఉన్నట్లు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లారు. వారసత్వ అర్చకత్వానికి సంబంధించి 1996లో డాక్టర్ ఎంవీ సౌందరరాజన్ దాఖలు చేసిన రిట్ పిటిషన్ పై సుప్రీం కోర్టు సానుకూలంగా స్పందించిన విషయాన్ని గుర్తు చేశారు.

వారసత్వ అర్చకత్వానికి తిలోదకాలిస్తే..
అలాగే వారసత్వ అర్చకత్వానికి తిలోదకాలిస్తే గ్రామీణ ప్రాంతాల్లోని ఆలయాలతో పాటు కొన్ని ఆలయాలు మూతపడే ప్రమాదం ఉందని రంగరాజన్ ఆవేదన వ్యక్తం చేశారు. ఈ క్రమంలోనే దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి 2007లో వారసత్వ అర్చకత్వాన్ని పునరుద్ధరించాలని చట్టం చేసినప్పటికీ.. 16 ఏళ్లు గడుస్తున్నా తెలంగాణలో ఆ చట్టం అమలు కాలేదని చెప్పారు. ఏపీలో 2019లో GO Ms 439ను విడుదల చేసి వేలాది మంది అర్చకుల కుటుంబాలకు బాసటగా నిలిచిని విషయాన్ని ప్రస్తావించారు.

తెలంగాణలో ఆ చట్టాన్ని అమలు చేయకపోగా దేవాదాయ శాఖ వారసత్వ అర్చకుల బదిలీకి పూనుకోలేదన్నారు. పే స్కేల్ అమలు చేయడమే పరిష్కారం అని చెబుతూ ప్రభుత్వాన్ని కొందరు అధికారులు తప్పదోవ పట్టించి అర్చకులు ఎదుర్కొంటున్న అసలు సమస్యలను తెరమరుగు చేస్తున్నారని డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్కకు వివరించారు. దీనిపై తక్షణమే స్పందించిన భట్టి అధికారులతో మాట్లాడి చర్యలు తీసుకుంటామని హీమీ ఇచ్చారు.

Advertisment
తాజా కథనాలు