Hanmakonda : వినాయక చవితి హిందువులకు ఎంతో పవిత్రమైంది: దాస్యం వినయ్ భాస్కర్.

వడ్డేపల్లిలోని తన నివాసంలో, బలసముద్రంలోని క్యాంప్ కార్యాలయంలో మరియు హన్మకొండ జిల్లా బీఅర్ఎస్ పార్టీ కార్యాలయంలో ప్రతిష్టించిన మట్టి గణపతులకు కుటుంబ సమేతంగా ప్రత్యేక పూజలు నిర్వహించిన హన్మకొండ జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు దాస్యం వినయ్ భాస్కర్.

New Update
Hanmakonda : వినాయక చవితి హిందువులకు ఎంతో పవిత్రమైంది: దాస్యం వినయ్ భాస్కర్.

ప్రత్యేక పూజలు

వడ్డేపల్లిలోని తన నివాసంలో, బలసముద్రంలోని క్యాంప్ కార్యాలయంలో మరియు హన్మకొండ జిల్లా బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో ప్రతిష్టించిన మట్టి గణపతులకు కుటుంబ సమేతంగా ప్రత్యేక పూజలు నిర్వహించిన రాష్ట్ర ప్రభుత్వ చీఫ్ విప్ హన్మకొండ జిల్లా బీఅర్ఎస్ పార్టీ అధ్యక్షులు (Dasyaam Vinay Bhaskar) దాస్యం వినయ్ భాస్కర్.

ప్రజలంతా సుభిక్షంగా ఉండాలని

సీఎం కేసీఆర్ నాయకత్వంలో ప్రజలంతా సుభిక్షంగా ఉండాలని గణనాథున్ని ప్రార్థించిన చీఫ్ విప్. గణాలకు అధిపతి అయిన ప్రథమ దేవుడు వినాయకుడిని పూజించే వినాయక చవితి పర్వదినం హిందువులకు ఎంతో పవిత్రమైనదని అన్నారు. వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభ... నిర్విఘ్నం కురుమేదేవ సర్వేకార్యేషు సర్వదా... అంటూ శుభం కలుగాలని ఏకదంతుణ్ణి భక్తులు ఆరాధిస్తారని తెలిపారు.

Chief Whip congratulated Vinayaka Chavithi

వినాయక చవితి శుభాకాంక్షలు

విఘ్నాలు తొలగించే ఆది దేవుడైన వినాయకుని వేడుకలను ఎప్పటిలాగే సహృద్భావ వాతావరణంలో ప్రజలంతా ఆనందోత్సాహాలతో జరుపుకోవాలని చీఫ్ విప్ ఈ సందర్బంగా ఆకాంక్షించారు. వినాయక చవితి  9Vinayaka Chavithi) పండుగ ప్రతి ఇంటా సుఖసంతోషాలు నింపాలని, గణనాథుడి కృపాకటాక్షాలతో సీఎం కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణ రాష్ట్రం మరింత ప్రగతి సాధిస్తుందని ఆశాభావం వెలిబుచ్చారు. అందరూ సుభిక్షంగా ఉండాలని గణనాథున్ని ప్రార్థించి, రాష్ట్ర ప్రజలకు వినాయక చవితి శుభాకాంక్షలు తెలిపారు.

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు