Fire Accident : ఫ్యాక్టరీలో భారీ అగ్ని ప్రమాదం... ఇద్దరు మహిళ కార్మికులు మృతి!

ఛత్తీస్‌గఢ్‌ రాయ్‌పూర్‌ లోని గోండ్వారా ప్రాంతంలోని మెట్రస్‌ ఫ్యాక్టరీలో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఇద్దరు మహిళా కార్మికులు మృతి చెందారు. ప్రమాదం గురించి సమాచారం అందుకున్న వెంటనే అగ్నిమాపక సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకున్నారు.

New Update
Fire Accident : ఏపీలో భారీ అగ్ని ప్రమాదం.. ఆ ప్రాంతాలను చుట్టుముట్టిన రసాయన పొగ

Fire Accident In Factory : ఛత్తీస్‌గఢ్‌ రాయ్‌పూర్‌ లోని గోండ్వారా ప్రాంతంలోని మెట్రస్‌ ఫ్యాక్టరీ (Metrus Factory) లో భారీ అగ్ని ప్రమాదం (Fire Accident) జరిగింది. ఈ ప్రమాదంలో ఇద్దరు మహిళా కార్మికులు మృతి చెందారు. ప్రమాదం గురించి సమాచారం అందుకున్న వెంటనే అగ్నిమాపక సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకున్నారు. ప్రస్తుతం మంటలు అదుపులోకి వచ్చాయి.

జిల్లా యంత్రాంగం, పోలీసు అధికారులు ఘటనాస్థలికి చేరుకొని అగ్నిప్రమాదానికి గల కారణాలపై విచారణ కొనసాగిస్తున్నారు. ఖమ్తరాయ్ పోలీస్ స్టేషన్ పరిధిలోని గోండ్వారా ప్రాంతంలో ఉన్న శ్రీ గురునానక్ మ్యాట్రెస్ కంపెనీ (Sri Guru Nanak Metrus Company) లో మంటలు చెలరేగాయి. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది వెంటనే ఘటనాస్థలికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు.

పోలీసుల నివేదికల ప్రకారం, ఫ్యాక్టరీలో ఉన్న ఏడుగురు కార్మికులలో ఐదుగురు ఈ ప్రమాదం నుండి తప్పించుకున్నారు. అయితే సరోరా గ్రామానికి చెందిన యమునా, రామేశ్వరి అనే ఇద్దరు మహిళలు లోపల ఇరుక్కుపోయి మృతి చెందారు. తీవ్రంగా గాయపడిన వారిని ఆసుపత్రికి తరలించగా, అక్కడ చికిత్స పొందుతూ వారు మరణించారు. ఈ విషయాన్నీ పోలీసు అధికారులు నిర్థారించారు.

Also Read : స్కూటీ అంటే పాప.. బైక్‌ అంటే బాబు..మేడిపల్లి శిశువుల అమ్మకం కేసులో సంచలన విషయాలు..!

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు