Chhattisgarh Exit Polls: కాంగ్రెస్ చేతికే మళ్ళీ ఛత్తీస్‌ఘడ్..ఎగ్జిట్ పోల్ సర్వే

ఛత్తీస్‌గఢ్‌లో తొలి విడత 20 సీట్లకు తర్వాత 70 స్థానాలకు ఎన్నికలు జరిగాయి. ఈసారి ఎన్నికల్లో విజయం తమ ఖాతాలో వేసుకోవాలని చూస్తోంది బీజేపీ. కాంగ్రెస్ మాత్రం తమ గెలుపుపై ధీమాగా ఉంది. దానికి తగ్గట్టే ఎగ్జిట్ పోల్స్ సర్వేలుకూడా కాంగ్రెస్సే అధికారంలోకి వస్తుందని చెబుతున్నాయి.

New Update
Chhattisgarh Exit Polls: కాంగ్రెస్ చేతికే మళ్ళీ ఛత్తీస్‌ఘడ్..ఎగ్జిట్ పోల్ సర్వే

Chhattisgarh Exit Polls: ఛత్తీస్ ఘడ్ లో మొదటి నుంచి క్రాంగ్రెస్ (Congress) గాలే వీస్తోంది. ప్రస్తుతం అధికారంలో ఉన్న ఆ పార్టీనే గెలుస్తుందని అందరూ చెబుతున్నారు. ఇక్కడ బీజేపీ తిష్ట్ వేయాలని చూస్తున్నా అది కుదిరేలా కనిపించడం లేదు. ఛత్తీస్‌ఘడ్ లో రెండు విడతలగా ఎన్నికల పోలింగ్ జరిగింది. మావోయిస్ట్ ప్రభావిత ప్రాంతాలు అయిన 20 స్థానాలకు ముందు పోలింగ్ నిర్వహించి తరువాత 70 స్థానాలకు పోలింగ్ నిర్వహించారు. ప్రస్తుత ఎగ్జిట్ పోల్స్ సర్వే ప్రకారం కాంగ్రెస్ 40- 50 సీట్లు సంపాదించి మళ్ళీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందని తెలుస్తోంది. ఇక్కడ ప్రభుత్వ వ్యతిరేకత ఉన్నా కూడా ప్రజలు బీజేపీ వైపు మొగ్గు చూపడం లేదని సర్వేలు చెబుతున్నాయి.

పీపుల్స్‌ పల్స్‌
బీజేపీ 29-39
కాంగ్రెస్‌ 54-64
ఇతరులు 2

ఇండియా టుడే
బీజేపీ 36-46
కాంగ్రెస్‌ 40-50
ఇతరులు 0-5

Also Read: ఎగ్జిట్ పోల్స్.. ఎప్పుడు ఎలా ప్రారంభం అయ్యాయో తెలుసా?

సీఎన్‌ఎన్‌ న్యూస్‌ 18
బీజేపీ 41
కాంగ్రెస్‌ 46
స్వతంత్రులు 3

జన్‌ కీ బాత్‌
బీజేపీ 34-45
కాంగ్రెస్‌ 42-53
ఇతరులు 0

ఏబీపీ సీ ఓటర్‌
బీజేపీ 36-48
కాంగ్రెస్‌ 41-53
ఇతరులు 0

ఇండియా టీవీ సీఎన్‌ఎక్స్‌
బీజేపీ 30-40
కాంగ్రెస్‌ 46-56
ఇతరులు 0

Also Read: రాజస్థాన్ ఎగ్జిట్ పోల్ సర్వేల అంచనాలివే..

అయితే ఎగ్జిట్ పోల్స్ అనేవి కేవలం అంచనాలు మాత్రమే. ఇవి తారుమారు అయ్యే ఛాన్స్ లు కూడా ఉంటాయి. ఓటరు ఒక సర్వే ఏజెన్సీ అడిగితే ఒకలా...ఇంకో సర్వే ఏజెన్సీ అడిగితే ఇంకోలా చెప్పవచ్చును. అసలు ఫలితాలు తేలిది మాత్రం ఓట్ల లెక్కింపు రోజునే. ఐదు రాష్ట్రాల పోలింగ్ వేరు వేరు రోజుల్లో జరిగినా..ఓట్ల లెక్కింపు మాత్రం ఒకే రోజున జరుగుతుంది. మరో రెండు రోజుల్లో అంటే డిసెంబర్ 3 న ఐదు రాష్ట్రాల భవితవ్యం తేలిపోతుంది.

Advertisment
తాజా కథనాలు