Chhattisgarh: భారత సైన్యంలోకి మరో 9మంది ట్రాన్స్‌జెండర్లు!

భారత పారామిలిటరీ బలగాల్లో మరో 9 మంది ట్రాన్స్‌జెండర్లు చేరారు. ఛత్తీస్‌గఢ్‌లో మావోయిస్టు వ్యతిరేక ఆపరేషన్‌లో విధులు నిర్వహిస్తున్న బస్తర్‌ ఫైటర్స్‌ దళంలో వీరు పనిచేయనున్నట్లు అధికారులు తెలిపారు. ఇప్పటికే బస్తర్ ఫైటర్స్ లో 13 మంది ట్రాన్స్‌జెండర్లు, 90 మంది మహిళలున్నారు.

New Update
Chhattisgarh: భారత సైన్యంలోకి మరో 9మంది ట్రాన్స్‌జెండర్లు!

Transgenders: భారత సైన్యంలోకి మరో 9మంది ట్రాన్స్‌జెండర్లు చేరారు. ఛత్తీస్‌గఢ్‌లో (Chhattisgarh) మావోయిస్టు వ్యతిరేక ఆపరేషన్‌లో కీలకంగా వ్యవహరిస్తున్న బస్తర్‌ ఫైటర్స్‌ దళంలోకి సోమవారం మరో 9 మంది ట్రాన్స్‌జెండర్లను నియమించినట్లు అధికారులు తెలిపారు. 2023లో ఎంపికైన వీరంతా వివిధ విభాగాల్లో శిక్షణ పొంది, కేంద్ర పారామిలిటరీ బలగాలతో కలిసి నక్సలైట్ వ్యతిరేక కార్యాచరణకు సన్నద్ధమవుతున్నట్లు పేర్కొన్నారు.

అయితే ఈ బలగాలు మావోయిస్టు ప్రభావిత ప్రాంతమైన బస్తర్‌ రేంజిలోని కాంకేర్‌ జిల్లాలో విధులు నిర్వర్తించనున్నారు. 2021లో బస్తర్‌ ఫైటర్స్‌ ప్లాటూన్‌ను 2,100 మంది స్థానిక యువతతో ఏర్పాటు చేయగా.. బస్తర్, దంతెవాడ, కాంకేర్, బీజాపూర్, నారాయణ్‌పూర్, కొండగావ్‌, సుక్మా జిల్లాల్లో కేంద్ర బలగాలతో కలిసి పనిచేస్తున్నారు. ఈ బలగాల్లో ఇప్పటికే 13 మంది ట్రాన్స్‌జెండర్లు, 90 మంది మహిళలు విధులు నిర్వహిస్తున్నట్లు మిలిటరీ అధికారి వెల్లడించారు.

Also Read: వైసీపీ నాకు శత్రువు కాదు.. పవన్ కల్యాణ్ కీలక వ్యాఖ్యలు!

Advertisment
తాజా కథనాలు