Eat Carrots: క్యారెట్‌లను చాలా మంది తింటారు..? కానీ దానిని సరైన పద్దతిలో తినాలని ఎవ్వరికి తెలియదు. కొందరైతే.. దీనిని పాయసం కూడా చేస్తారు. అయితే.. ఇది క్యారెట్ తినడం అనారోగ్యకరమైన మార్గం, శరీరానికి హాని చేస్తుంది. అంతేకాదు శరీరానికి ఫైబర్, పోషకాలు లభించవు. దీంతో చక్కెర, కొవ్వు, అధిక కేలరీలు అందుతాయి. అంతేకాకుండా.. హల్వా తినడం వల్ల శరీరానికి దాదాపు సున్నా ప్రయోజనం లభిస్తుంది. అందుకే..క్యారెట్‌లను తినడానికి సరైన మార్గం గురించి కొన్ని విషయాలు తెలుసుకోవాలి. తద్వారా మనం దాని పూర్తి ప్రయోజనాన్ని పొందవచ్చు. క్యాట్‌ని ఎలా తినాలో దాని గురించి కొన్ని విషయాలు తెలుసుకుందాం.
క్యారెట్ తినడానికి సరైన మార్గం
- క్యారెట్‌లను ఎప్పుడూ నమలిన తినాలి. పచ్చి క్యారెట్‌లో ఫల్కారినోల్ ఉంటుంది. ఇది యాంటీ ఆక్సిడెంట్ ఉన్నాయి. పచ్చి క్యారెట్ తింటే బీటా-కెరోటిన్ పొందుతారు. ఇది కళ్ళు, చర్మం, జుట్టును ఆరోగ్యంగా ఉంచుతుంది. పచ్చి క్యారెట్లు తినకపోతే..దాని నుంచి సూప్, ఉడకబెట్టి తినవచ్చు.
గుండె జబ్బు సమస్యలు తగ్గుతాయి..
- 25 గ్రాముల క్యారెట్లు తింటే కరోనరీ హార్ట్ డిసీజ్ వచ్చే అవకాశాలు 32% తగ్గుతాయని పరిశోధనలు తెలింది. ఇది బీపీని బ్యాలెన్స్ చేస్తుంది. క్యారెట్‌లో లభించే పొటాషియం, సోడియం స్థాయిలను సమతుల్యం చేస్తుంది. శరీరం నుంచి దానిని తొలగించడానికి మేలు చేస్తుంది. దీని వల్ల బీపీ పెరగదు, గుండె అనేక వ్యాధుల బారిన పడకుండా ఉంటారు.
ఎముకలకు సహాయపడవచ్చు
- క్యారెట్‌లో కాల్షియం, ఫాస్పరస్,విటమిన్ కె ఎక్కువగా ఉన్నాయి. ఇది శరీరానికి ఈ పోషకాల అవసరాన్ని తీరుస్తుంది. ఈ మూడు పోషకాలు ఆరోగ్యకరమైన ఎముకల పెరుగుదల, అభివృద్ధి,మరమ్మత్తు కోసం అవసరం పడతాయి. ఈ విటమిన్లు, ఖనిజాలు లేని ఆహారం ఎముక సాంద్రత తగ్గడానికి దారితీస్తుంది. కావునా..ఈ కారణాల వల్ల మీరు రోజూ క్యారెట్ తింటే ఆరోగ్యానికి ఎంతో మంచిది.
ఇది కూడా చదవండి: మీ రోగాలు పారిపోవాలా..? పొద్దున లేవగానే ఈ రెండు తినండి
గమనిక: ఈ కథనం ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇచ్చినది. RTV దీనిని ధృవీకరించడంలేదు. ఆరోగ్య సమస్యల నివారణకు సంబంధిత వైద్య నిపుణుడిని సంప్రదించడం ఉత్తమం.