Chevireddy: చెవిరెడ్డి మోహిత్‌ రెడ్డి విడుదల!

చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తి నానిపై హత్యాయత్నం కేసులో మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి కుమారుడు మోహిత్ రెడ్డిని పోలీసులు 41 ఏ నోటీసులు ఇచ్చి విడుదల చేశారు.అతను విదేశాలకు వెళ్ళడానికి వీలు లేదనే షరతు విధించారు.

New Update
Chevireddy: చెవిరెడ్డి మోహిత్‌ రెడ్డి విడుదల!

Chevireddy Mohith Reddy: చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తి నానిపై (Pulivarthi Nani) హత్యాయత్నం కేసులో మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి కుమారుడు మోహిత్ రెడ్డిని పోలీసులు అరెస్ట్‌ చేసిన సంగతి తెలిసిందే. అయితే మోహిత్‌ ని ఆదివారం పోలీసులు 41 ఏ నోటీసులు ఇచ్చి విడుదల చేశారు. అతను విదేశాలకు వీలు లేదనే షరతు విధించారు.

మోహిత్‌ రెడ్డిని తిరుపతి పోలీసులు బెంగళూరులో నుండి దుబాయ్ వెళుతుండగా శనివారం అదుపులో తీసుకున్న విషయం తెలిసిందే. ఇవాళ ఉదయం తిరుపతి ఎస్వీ యూనివర్శిటీ పోలీస్ స్టేషన్ వద్దకు తీసుకువచ్చి విచారించి నోటీసు ఇచ్చారు. అయితే ప్రభుత్వం కక్షసాధింపు చర్యలకు దిగుతోందని కావాలనే కేసుల్లో ఇరికిస్తున్నారని మోహిత్ రెడ్డి మండిపడ్డారు.

Also Read: మహిళలకు ఉచిత బస్సు ప్రయాణంపై కీలక అప్డేట్

సీఆర్‌పీఎసీ 41ఏ కింద నోటీసులు ఇచ్చి ఎప్పుడు రమ్మంటే అప్పుడు రావాలని పోలీసులు కండీషన్‌ పెట్టారు. చెవిరెడ్డి భాస్కర్‌ రెడ్డిని రాజకీయంగా ఎదుర్కోలేక ఇలాంటి కేసులు పెడుతున్నారని మోహిత్ రెడ్డి ఆరోపిస్తున్నారు. భాస్కర్‌రెడ్డిని స్ఫూర్తిగా తీసుకుని పోరాడుతామని వివరించారు. తాము బతికి ఉన్నంత కాలం ప్రజల కోసమే పోరాడుతామన్నారు. టీడీపీ నేతలు చంద్రగిరి నియోజకవర్గంలో బీభత్సం సృష్టిస్తున్నారని.. వారు చేస్తున్న అన్ని దందాలను ప్రజలకు వివరిస్తామని అన్నారు.

ప్రజల కోసం పోరాటం చేస్తూనే ఉంటామన్నారు. ఎవరూ ఎన్ని కేసులు పెట్టినా వెనక్కి తగ్గేది లేదంటూ మోహిత్‌ రెడ్డి కామెంట్‌ చేశారు. అనంతరం ఎస్వీ వర్శిటి వద్ద శాంతియుత నిరసనకు దిగారు. అక్రమంగా తమపై కేసులు పెట్టారని.. దీనిపై న్యాయస్థానంలో పోరాటం చేస్తామని తెలిపారు.

Also Read: ఘోర రోడ్డు ప్రమాదం..ముగ్గురు అక్కడికక్కడే మృతి!

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు