రక్తం కారుతున్న కత్తితో పోలీస్ స్టేషన్‌కు వ్యక్తి.. అతను చెప్పింది విని పోలీసులు హడల్..

తమిళనాడులోని చెన్నైలో భయానక ఘటన వెలుగు చూసింది. దేవుడు చెప్పాడంటూ కమల్ ఉస్మాన్ అనే వ్యక్తి సెంథిల్ కుమార్ ను దారుణంగా కత్తితో పొడిచి చంపేశాడు. ఒకటి కాదు రెండు కాదు.. ఏకంగా 18 సార్లు కత్తితో పొడిచాడు. ఆపై రక్తం కారుతున్న కత్తి పట్టుకుని నేరుగా పోలీస్ స్టేషన్ కు వెళ్లి లొంగిపోయాడు. మహిళలతో చాటింగ్ చేస్తున్న కారణంగా అతన్ని దేవుడు చంపేయమన్నాడని, అందుకే చంపానంటూ నిందితుడు పోలీసులకు చెప్పాడు. అది విని పోలీసులు షాక్ అయ్యారు.

రక్తం కారుతున్న కత్తితో పోలీస్ స్టేషన్‌కు వ్యక్తి.. అతను చెప్పింది విని పోలీసులు హడల్..
New Update

Chennai Man commits murder: అతని శరీరమంతా బూడిద.. ఓ చేతిలో రక్తం కారుతున్న కత్తి.. నేరుగా పోలీస్ స్టేషన్‌కు(Police Station) వచ్చాడు.. అతన్ని చూసి షాక్ అయిన పోలీసులు ఏం జరిగిందని ఆరా తీశారు. ఇంకేముంది.. జరిగిన ఘటనంతా సీన్ టు సీన్ వివరించాడు. అతను చెప్పింది విని పోలీసులు హడలిపోయారు. వెంటనే అతన్ని అదుపులోకి తీసుకుని.. అతను చెప్పిన ప్రదేశానికి వెళ్లి చూశారు. ఇంతకీ అతను ఏం చెప్పాడు? పోలీసులు ఎందుకు భయపడ్డారు? అసలేం జరిగింది? మ్యాటర్ తెలియాలంటే.. ఈ స్టోరీ మొత్తం చదవాల్సిందే.

చెన్నైలోని తిరువామియూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో దారుణం చోటు చేసుకుంది. దేవుడు ఆదేశించాడంటూ.. ఓ పెయింటర్‌ను దారుణంగా హత్య చేశాడు వ్యక్తి. ఈ ఘటన స్థానికంగా పెను సంచలనం సృష్టిస్తోంది. ఈ ఘటనకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. తనను తాను కమల్ ఉస్మాన్‌(48)గా చెప్పుకున్న నిందితుడు.. తిరువాన్మియూర్ ఇంట్లో పెయింటర్ సెంథిల్ కుమార్‌ను హత్య చేసినట్లు చెప్పాడు. ఇక ఈ హత్యకు కారణాన్ని కూడా వివరించాడు.

Also Read: శరీరంలో గాయం మచ్చ పోవట్లేదా? జస్ట్ ఇలా చేస్తే చాలు మరక మాయం..!

2019లో తన వ్యాపారంలో తీవ్ర నష్టాన్ని చవిచూశానని, అప్పటి నుంచి తాను శివ భక్తుడిగా మారానని ఉస్మాన్ చెప్పాడు. అంతేకాదు.. తాను 'చెడ్డ వ్యక్తులను' గుర్తించడంలో ప్రత్యేక పవిత్రమైన శక్తులును పొందానని చెప్పుకొచ్చాడు. తాను చంపిన వ్యక్తి కొంతమంది మహిళలతో చాట్ చేయడం చూశానని, సెంథెల్‌ను భూమి నుంచి పైకి పంపమని దేవుడు ఆదేశించాడని పోలీసులకు చెప్పాడు.

సోమవారం ఉస్మాన్ కుమార్.. సెంథెల్ ఇంట్లోకి వెళ్లి తన వెంట తెచ్చుకున్న కత్తితో అతన్ని 18 సార్లు పొడిచాడు. అతను చనిపోయాడని నిర్ధారించుకున్న తరువాత.. ప్రశాంతంగా రక్తం కారుతున్న కత్తితోనే తిరువామియూర్ పోలీస్ స్టేషన్‌కు వెళ్లాడు నిందితుడు ఉస్మాన్. జరిగిన కథనంతా పోలీసులకు చెప్పి.. లొంగిపోయాడు.

కాగా, ఉస్మాన్‌ను అదుపులోకి తీసుకున్నప్పుడు అతని ఒంటిపై బూడిద.. కొన్ని పూజా సామాగ్రి ఉన్నట్లు తెలిపారు పోలీసులు. నిందితుడి వాంగ్మూలం తీసుకుని, కేసు నమోదు చేశారు పోలీసులు. కాగా, ఉస్మాన్‌ను మెజిస్ట్రేట్ ముందు హాజరుపరుచగా.. వైద్యపరమైన పరీక్షలు నిర్వహించాలని, అతని మెంటల్ కండీషన్‌ను పరిశీలించాలని ఆదేశించింది కోర్టు. ఇక సెంథిల్ కుమార్ మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు.

Also Read: ఈ రాశుల వారు వారం రోజులు చాలా జాగ్రత్తగా ఉండాలి.. లేదంటే కష్టాలు తప్పవు..!

#chennai #tamil-nadu #chennai-police #tamil-nadu-police
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe