Movies:మన్సూర్ అలీఖాన్ కు చివాట్లు పెట్టిన చెన్నై హైకోర్టు

తమిళ నటుడు మన్సూర్ అలీ ఖాన్ కు చెన్నై హైకోర్టు చివాట్లుపెట్టింది. త్రిష కదా నీ మీద కేసు పెట్టాలి..నువ్వెందుకు పెట్టావు అంటూ న్యాయమూర్తులు ఆగ్రహం వ్యక్తం చేశారు. వెధవ పనులు చేసి అమాయకుడిని అని చెప్పుకోవడం అలవాటు అయిపోయిందని అన్నారు.

New Update
చిరంజీవిపై కోర్టుకెక్కిన మన్సూర్ అలీఖాన్ కు రూ.1 లక్ష జరిమానా

స్టార్ హీరోయిన్ త్రిషపై తమిళ నటుడు మన్సూర్ అలీఖాన్ చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపాయి. ఓ యూట్యూబ్ ఇంటర్వ్యూలో మన్సూర్ అలీఖాన్ మాట్లాడుతూ త్రిషపై అనుచిత వ్యాఖ్యలు చేశాడు. దీంతో త్రిషతో పాటు పలువురు సినీ ప్రముఖులు మన్సూర్ అలీఖాన్ వ్యాఖ్యలను తప్పుబట్టారు. ఈ క్రమంలో త్రిష, ఖుష్బూ, చిరంజీవి తనను నిందించడం వల్ల తన పరువుకు భంగం కలిగిందని.. వారి నుంచి తనకు పరువునష్టం ఇప్పించాలని మద్రాసు హైకోర్టులో కేసు వేశాడు. కోటి రూపాయలు చెల్లించాలంటూ డిమాండ్ చేశాడు.

Also read:వన్ అండ్ ఓన్లీ సూపర్ స్టార్..హ్యాపీ బర్త్ డే రజనీకాంత్

మన్సూ్ర్ వేసిన పరువునష్టం కేసు మీద చెన్నై హైకోర్టులో విచారణ జరిగింది. ఈ కేసును విచారిస్తున్న న్యాయమూర్తి మన్సూర్ అలీఖాన్‌పై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఒక ప్రముఖ నటిపై బహిరంగంగా మన్సూర్ అలీఖాన్ అసభ్యకర వ్యాఖ్యలు చేశాడని జడ్జి అన్నారు. నిజానికి మన్సూర్ అలీఖాన్‌పై త్రిష కేసు వేయాలని న్యాయమూర్తి అభిప్రాయపడ్డారు. మన్సూర్ అలీఖాన్‌కు నిత్యం వివాదాల్లోకి దూరడం.. అంతాచేసి తనను తాను అమాయకుడినని చెప్పుకోవడం అలవాటుగా మారిందని న్యాయమూర్తి విమర్శించారు.

అయితే, మన్సూర్ అలీఖాన్ న్యాయవాది తన క్లయింట్ తప్పేమీ లేదని వాదించారు. ఒక ఇంటర్వ్యూలో చిన్న క్లిప్ కట్ చేసి తన క్లయింట్‌పై నిందలు వేశారన్నారు. అదే కనుక నిజమైతే ఇంటర్వ్యూ పూర్తి వీడియో కోర్టుకు చూపించాలని జడ్జి అడిగారు. దీనికి మన్సూర్ అలీఖాన్ న్యాయవాది అంగీకరించారు. తాను పూర్తి వీడియోను కోర్టుకు సమర్పిస్తానని.. అయితే, మన్సూర్‌పై త్రిష చేసిన సోషల్ మీడియా పోస్టు తీసేయాలని మన్సూర్ అలీ ఖాన్ లాయర్ డిమాండ్ చేశారు. ఈ వాదనలు విన్న న్యాయమూర్తి.. త్రిష, ఖుష్బూ, చిరంజీవి వారి స్టేట్‌మెంట్లను కోర్టుకు సమర్పించాలని ఆదేశించారు. కేసును డిసెంబర్ 22కు వాయిదా వేశారు.

లియో సినిమాలో త్రిషతో రేప్ సీన్ ఉంటుందని ఆశపడ్డానని.. కానీ దర్శకుడు లోకేష్ కనగరాజ్ తనను నిరాశపరిచారని మన్సూర్ అలీఖాన్ ఓ యూట్యూబ్ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ అన్నాడు. త్రిషతో తన సీన్ ఎలా ఉండాలని భావించాడో కూడా వివరించాడు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ మన్సూర్ అలీఖాన్ వ్యాఖ్యల మీద తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇక మీదట మన్సూర్‌తో కలిసి ఏ సినిమాలో నటించనని స్పష్టం చేశారు.

Advertisment
తాజా కథనాలు