Cab Driver: క్యాబ్‌ డ్రైవర్ ఖాతాలో 9 వేల కోట్లు..అంతలోనే ఊహించని ట్విస్ట్‌!

కుటుంబ భారాన్ని మోసేందుకు ఆ వ్యక్తి అద్దెకు క్యాబ్‌ (Rent cab) నడుపుతున్నాడు. అయితే అతనిని ఒక్కసారిగా అదృష్ట లక్ష్మీ పలకరించింది. అతని బ్యాంకు ఖాతాలో ఒక్కసారిగా 9 వేల కోట్లు(9 thousand crores) వచ్చిపడ్డాయి

New Update
Cab Driver: క్యాబ్‌ డ్రైవర్ ఖాతాలో 9 వేల కోట్లు..అంతలోనే ఊహించని ట్విస్ట్‌!

కుటుంబ భారాన్ని మోసేందుకు ఆ వ్యక్తి అద్దెకు క్యాబ్‌ (Rent cab) నడుపుతున్నాడు. అయితే అతనిని ఒక్కసారిగా అదృష్ట లక్ష్మీ పలకరించింది. అతని బ్యాంకు ఖాతాలో ఒక్కసారిగా 9 వేల కోట్లు(9 thousand crores) వచ్చిపడ్డాయి. ఇది నిజమో..కలో తెలుసుకునేందుకు అతని స్నేహితునికి ఓ 21 వేలు పంపి చూశాడు. నిజమే..డబ్బులు స్నేహితుని ఖాతాలోనికి వెళ్లాయి.

దీంతో అతని ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. అయితే ఇంతలోనే అతనికి ఊహించని షాక్‌ తగిలింది. ఏంటంటే ...జమ అయిన డబ్బు మొత్తాన్ని వెనక్కి ఇవ్వాలని బ్యాంకు అధికారుల నుంచి ఫోన్‌. అంతే అతను ఈ విషయం గురించి ఎవరికి చెప్పుకోవాలో తెలియక తల పట్టుకుని కూర్చున్నాడు.

అసలేం జరిగిందంటే.. తమిళనాడు చెన్నై(Chennai)లో పళని నెయ్‌క్కారపట్టికి చెందిన రాజ్ కుమార్‌ అనే వ్యక్తి కోడంబాక్కంలో తన స్నేహితుని వద్ద ఉంటూ అద్దెకు ఓ క్యాబ్ నడుపుకుంటున్నాడు. అయితే తమిళనాడు మర్కంటైల్ బ్యాంకు టీనగర్‌లో ఓ బ్రాంచ్‌ ని కలిగి ఉంది. కొద్ది రోజుల క్రితం రాజ్‌ మొబైల్‌ కు ఓ మెసేజ్‌ వచ్చింది. అందులో ఒకటి కాదు..రెండు కాదు..ఏకంగా 9 వేల కోట్లు తన ఖాతాలో జమైనట్లు ఉంది. అయితే ఈ సొమ్ము ఎలా వచ్చిందోనని తెలియక గందరగోళానికి గురయ్యాడు.

ముందు దీనిని పెద్దగా పట్టించుకోకపోయినప్పటికీ..ఇది నిజమో కాదో తెలుసుకోవాలనుకున్నాడు. దాంతో తన స్నేహితుని అకౌంట్‌ కి రూ.21 వేలు నగదు పంపాడు. తన ఖాతాలో నుంచి డబ్బు వెళ్లినట్లు మళ్లీ మెసేజ్‌ వచ్చింది. తన ఖాతాలో కోట్ల రూపాయలు ఉన్నది నిజమే అని తెలుసుకుని సంబరంలో మునిగిపోయాడు. కానీ ఆ సంబరాలు ఎంతో సేపు నిలవలేదు. బ్యాంకు అధికారులు ఫోన్ చేసి తమ డబ్బు మొత్తాన్ని వెనక్కి తిరిగి ఇవ్వమని. చెప్పినట్లుగానే ఆ మొత్తాన్ని వెనక్కి తీసుకుంది కూడా.

దీంతో పాటు తన స్నేహితుడికి పంపిన డబ్బును కూడా వెంటనే చెల్లించాలని వారు తెలిపారు. దీంతో రాజ్‌ కుమార్ చెన్నై టీనగర్ లోని బ్రాంచ్‌ కు లాయర్ ను తీసుకుని వెళ్లి మాట్లాడటంతో సమస్య పరిష్కారమైది.స్నేహితుడికి పంపిన రూ.21 వేలు తిరిగి ఇవ్వాల్సిన పని లేదని, వాహన రుణం ఇస్తామని బ్యాంకు వారు చెప్పినట్లు సమాచారం.

Advertisment
తాజా కథనాలు