Pawan Kalyan: పవన్ కి హరిరామజోగయ్య బహిరంగ లేఖ! జనసేన అధినేత పవన్ కల్యాణ్ కు మాజీ మంత్రి హరిరామజోగయ్య బహిరంగ లేఖ రాశారు. రాబోయే కాలంలో ఏపీకి కాబోయే ముఖ్యమంత్రి చంద్రబాబు అని లోకేష్ ప్రకటించారు..మీరు కూడా పలు సందర్బాల్లో తెలిపారు. మీరు మీకోసం వేచి చూస్తున్న జనసైనికులకు మీరేం చెప్పబోతున్నారంటూ ప్రశ్నించారు. By Bhavana 22 Dec 2023 in ఆంధ్రప్రదేశ్ విజయవాడ New Update షేర్ చేయండి Hari Ramajogaiah: జనసేన అధినేత పవన్ కల్యాణ్ కి మాజీ మంత్రి , కాపు సంక్షేమ సేన అధ్యక్షుడు హరిరామజోగయ్య బహిరంగ లేఖ రాశారు. ఆ లేఖలో ఆయన పవన్ కు (Pawan Kalyan) పలు ప్రశ్నలు సంధించారు. అందులో ఆయన '' చంద్రబాబే (Chandrababu) కాబోయే ముఖ్యమంత్రి ..ఈ నిర్ణయంలో రెండో మాట లేదు..అనుభవమున్న నాయకుని నాయకత్వమే రాష్ట్రానికి కావాలని పవన్ ఇప్పటికే పలు సందర్భాల్లో చెప్పారు. కాబట్టి అదే అందరి మాట అంటూ లోకేష్ బాబు (Nara Lokesh) ప్రకటించేశారని ఆయన లేఖలో పేర్కొన్నారు. లోకేష్ బాబు ఆశిస్తున్నట్లు చంద్రబాబునే పూర్తి కాలం ముఖ్యమంత్రి కావాలని మీరు కోరుకుంటున్నారా? దానికి మీ ఆమోదం ఉందా? అంటూ ఆయన పవన్ ని ప్రశ్నించారు. మీరే ముఖ్యమంత్రి (AP CM) కావాలని, అధికారం చేపట్టడం ద్వారా బడుగు బలహీనవర్గాలు యాచించే స్థితి నుంచి శాసించే స్థితికి రావాలి అని కలలు కంటున్న జనసైనికుల కలలు ఏం కావాలనుకుంటున్నారు? అంటూ హరిరామ జోగయ్య లేఖలో పవన్ ని ప్రశ్నించారు. ఆంధ్రప్రదేశ్ ఏర్పడిన నాటి నుంచి కూడా రెండే రెండు కుల నాయకులు రాజ్యమేలుతున్నారు. 80 శాతం జనాభా ఉన్న బడుగు బలహీన వర్గాలకు మోక్షం కలిగేదెప్పుడు? అని ప్రశ్నించారు. '' మీరు పెద్దన్న పాత్ర వహిస్తూ బడుగు బలహీన వర్గాలకొక దారి చూపిస్తారని, నీతివంతమైన పరిపాలన ప్రజలకు అందిస్తారని ఎదురు చూస్తున్న ప్రజానీకానికి మీరు చెప్పే సమాధానం ఏంటి? అంటూ అడిగారు. నేను అడిగిన ప్రశ్నలన్నిటికీ కూడా మీ నుంచి జన సైనికులకు సంతృప్తికరమైన సమాధానాలను ఆశిస్తూ రాజ్యాధికారాన్ని చేపట్టే విషయంలో మీ వైఖరి ఏంటో జన సైనికులందరకీ అర్థమయ్యేలే చెప్పాల్సిందిగా కోరుతున్నాం అంటూ ఆయన పవన్ కి లేఖ రాశారు. విజయనగరం జిల్లా నెల్లిమర్ల నియోజకవర్గం నుంచి లోకం మాధవి, విశాఖ ఉత్తరం నుంచి పసుపులేటి ఉషాకిరణ్, తూర్పుగోదావరి జిల్లా కొత్తపేట నియోజకవర్గంలో బండారు శ్రీనివాసరావు, కృష్ణాజిల్లా అవనిగడ్డ నియోజకవర్గంలో గుడివాడ శేషుబాబు, కడప జిల్లా రాజంపేట నియోజకవర్గంలో అతికారి దినేష్, తూర్పు గోదావరి జిల్లా రామచంద్రాపురం నియోజకర్గంలో పోలిశెట్టి చంద్రశేఖర్ రావు, పశ్చిమగోదావరి జిల్లా కొవ్వూరు నియోజకవర్గంలో టీవీ రామారావు, నెల్లూరు జిల్లా కావలి నియోజకవర్గంలో అలహరి సుధాకర్ లను పోటీలో నిలబెట్టేందుకు జనసేన ముందు నుంచి ఆలోచనలో ఉంది. Also read: ఆ భారతీయ విద్యార్థిని ఆచూకీ చెబితే 10 వేల డాలర్లు..అమెరికా ఎఫ్‌బీఐ! #janasena #pawankalyan #harirama-jogayya #open-letter మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి