Telangana: నిర్మల్‌ జిల్లాలోని ఆ గ్రామాల్లో చిరుత భయం.. వణికిపోతున్న రైతులు

నిర్మల్‌ జిల్లా తాండూరు మండలంలో చిరుత కలకలం సృష్టించింది. బెంబేరి శివారులో దూడను చంపి తింది. శివారు ప్రాంతంలో చిరుత పులి సంచరిస్తుండడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. బోను ఏర్పాటు చేసి చిరుతను బంధించాలని గ్రామస్తులు అధికారులను కోరుతున్నారు.

Telangana: నిర్మల్‌ జిల్లాలోని ఆ గ్రామాల్లో చిరుత భయం.. వణికిపోతున్న రైతులు
New Update

Nirmal: నిర్మల్‌ జిల్లా తాండూరు మండలంలో చిరుత కలకలం సృష్టించింది. బెంబేరి శివారులో దూడను చంపి తింది. వారం క్రితం ఇదే ప్రాంతంలో ఓ దూడని చంపిన చిరుత చెట్టుపైకి తీసుకెళ్లింది. దీంతో గ్రామస్తులు భయాందోళన చెందుతున్నారు. శివారు ప్రాంతంలో చిరుత పులి సంచరిస్తుండడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. బెంబేరి ప్రాంతంలో చిరుతను చూశామని రైతులు తెలిపారు. వారు ఈ విషయాన్ని అటవీశాఖ అధికారులకు సమాచారం ఇచ్చారు. అటవీ అధికారులు చిరుత సంచరించిన ప్రాంతంలో పర్యటించారు. చిరుత అడుగులను గుర్తించే పనిలో పడ్డారు. చిరుత సంచరిస్తున్నందున ఆ ప్రాంత రైతులు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు. కొంతకాలంగా చిరుత తాండూరు మండలంలోని పలు గ్రామాల్లో సంచరిస్తోందని రైతులు అంటున్నారు. చిరుత భయంతో కూలీలు రావడానికి భయపడుతున్నారని రైతులు అంటున్నారు. బోను ఏర్పాటు చేసి చిరుతను బంధించాలని కోరుతున్నారు.

ఇది కూడా చదవండి: తిరుమలలో వసంతోత్సవ శోభ..ఆ సేవలను రద్దు చేసిన టీటీడీ

#cheetah
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe