Holi Color Tips: హోలీ రంగు పోవడం లేదని ఈ వ్యక్తి చేసిన పని చూడండి హోలీ రోజు చాలా రకాల రసాయనాలు కలిపిన రంగులు వాడటం వల్ల కొన్ని రోజుల వరకు ముఖం, శరీరంపై రంగు అలాగే ఉండిపోతుంది. ఎన్ని ప్రయత్నాలు చేసినా రంగుమాత్రం వదలదు. షాంపూ, నిమ్మకాయ, ఈనో మిశ్రమాన్ని ఉపయోగించి ఓవ్యక్తి తన చేతులకు ఉన్న హోలీ రంగు తొలగిస్తున్న వీడియో మీరు చూడండి. By Vijaya Nimma 27 Mar 2024 in Latest News In Telugu టాప్ స్టోరీస్ New Update షేర్ చేయండి Holi Color Tips: హోలీ రోజు చాలా రకాల రసాయనాలు కలిపిన రంగులు వాడటం వల్ల కొన్ని రోజుల వరకు ముఖం, శరీరంపై రంగు అలాగే ఉండిపోతుంది. ఎన్ని ప్రయత్నాలు చేసినా రంగు మాత్రం వదలదు. అయితే ఓ వ్యక్తి చేసిన పని ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. రంగు వదిలించుకోవడానికి అతను కనిపెట్టిన ఫార్ములా చూసి నెటిజెన్లు ఫిదా అవుతున్నారు. షాంపూ, నిమ్మకాయ, ఈనో మిశ్రమాన్ని ఉపయోగించి ఒక వ్యక్తి తన చేతులకు ఉన్న హోలీ రంగు తొలగిస్తున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ వీడియోను ట్విట్టర్‌లో ఓ ప్రొఫెసర్ పోస్ట్ చేశాడు. రంగు వదిలించుకోవడానికి ఎఫెక్టీవ్ హ్యాక్ ఇదే అంటూ ట్యాగ్ చేశాడు. ఈ వీడియోలో ఒక యువకుడు షాంపూ, నిమ్మకాయ, ఈనోతో క్షణాల్లోనే చేతులకు ఉన్న రంగును పోగొట్టడంతో నెటిజెన్లు ఆశ్చర్యపోతున్నారు. అంతేకాకుండా ఈ పౌడర్‌కు ఈనో వాషింగ్ పౌడర్ అనే పేరు కూడా పెట్టారు. ఆ వీడియోలో యువకుడు అరచేతిపై కొద్దిగా షాంపూని తీసుకున్నాడు. ఆ తర్వాత కొద్దిగా నిమ్మరసం వేశాడు. తర్వాత ఈనో పౌడర్ వేసి బాగా కలిపి చేతులకు రాసుకున్నాడు. అంతే వెంటనే చేతులు తెల్లగా మారిపోయాయి. రంగు మొత్తం వదిలిపోయింది. సోషల్ మీడియాలో ఈ వీడియో ఇప్పటి వరకు 1.1 మిలియన్లకుపైగా వ్యూస్‌ని రాబట్టింది. Give this guy a Medal 🏅🥇 ~ Abhi Dekhna .... pic.twitter.com/WGvZvTvwhT — Professor (@Masterji_UPWale) March 25, 2024 ఇది చూసిన నెటిజన్లు రకరకాల కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు. ఇతన్ని పెట్టుకుంటే దేన్నైనా హ్యాక్ చేస్తాడని పలువురు అంటుంటే.. ఇది కొత్త స్టార్టప్ బిజినెస్ ఐడియా అని మరికొందరు కామెంట్లు చేస్తున్నారు. వంటకాలు, గ్యాస్ ట్రబుల్‌కి మాత్రమే కాదు కలర్ రిమూవర్‌గా కూడా ఈనో పనిచేస్తుందంటూ పలువురు నెటిజన్లు అంటున్నారు. ఇది కూడా చదవండి: వేసవిలో ఇవి తింటే శరీరంలోని నీరంతా మాయం..జాగ్రత్త గమనిక: ఈ కథనం ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇచ్చినది. RTV దీనిని ధృవీకరించడంలేదు. #holi-color-tips #best-tips మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి Advertisment సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి