ChatGPT : ఈ ఛాట్‌జీపీటీ అమ్మాయి వాయిస్‌ వింటే ప్రేమలో పడడం పక్కా!

చాట్‌జీపీటీ తన కొత్త వెర్షన్‌ వచ్చేసింది. ఈ వర్షన్ లో ఏఐ వాయిస్ అచ్చం అందమైన అమ్మాయి వాయిస్ ను మనకు వినిపించబోతుంది. ఈ చాట్‌జీపీటీకి ఎమోషన్స్‌ కూడా ఉన్నాయి. నవ్వుతుంది.. ఏడుస్తుంది.. ఇంకా ఎన్నో చేస్తోంది. విశేషాల కోసం ఈ ఆర్టికల్ చదివేయండి.

ChatGPT : ఈ ఛాట్‌జీపీటీ అమ్మాయి వాయిస్‌ వింటే ప్రేమలో పడడం పక్కా!
New Update

Woman Voice : అందమైన వాయిస్‌(Beautiful Voice) ఇష్టపడని వారు ఎవరుంటారు? వాయిస్‌ వినే ప్రేమ(Love)లో పడే వారు కూడా ఉంటారు.. హర్‌ మూవీ గుర్తింది కదా? 2013లో వచ్చిన ఈ అమెరికన్ సైన్స్-ఫిక్షన్ రొమాంటిక్ డ్రామా సీన్లు రియల్‌ లైఫ్‌లోనూ రిపీట్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయండోయ్..! ఏంటి అర్థంకాలేదా? చాట్‌జీపీటీ(Chat GPT) తన కొత్త వెర్షన్‌ను రిలీజ్ చేసింది. జీపీటీ-4ఓ పేరిట దీన్ని తీసుకొచ్చింది. త్వరలోనే మీ ఫోన్‌లోకి రాబోతున్న ఈ వెర్షన్‌కు సంబంధించిన ట్రయల్‌ వీడియోలు నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి. ఎందుకంటే ఏఐ వాయిస్‌ ఈసారి రోబోటిక్‌ కాదు.. అచ్చం అమ్మాయిలాగే ఏఐ సమాధానం చెబుతోంది. అది కూడా మాడ్యులేషన్‌తో..!

చాట్‌జీపీటీ కొత్త వెర్షన్‌ హర్‌ మూవీని గుర్తుకు తెస్తుంది. ఒక అమ్మాయి వాయిస్‌తో వినిపించే వర్చువల్ అసిస్టెంట్‌తో ఆ సినిమాలో హీరో బంధాన్ని పెంచుకుంటాడు. ఈ వాయిస్‌ను ఫేమస్‌ యాక్టరెస్‌ స్కార్లెట్ జాన్సన్‌ ఇచ్చారు. ఈ సినిమా హాలీవుడ్‌ చరిత్రలో ఓ సెన్సేషన్‌.. అటు చాట్‌జీపీటీ కొత్త వెర్షన్‌లోని అమ్మాయి వాయిస్‌ను స్కార్లెట్ జాన్సన్‌ వాయిస్‌తో పోల్చుతున్నారు నెటిజన్లు..ఎందుకంటే ఈ చాట్‌జీపీటీకి ఎమోషన్స్‌ కూడా ఉన్నాయి.. మీ కోసం నవ్వుతుంది.. అవసరమైతే ఏడుస్తుంది.. కావాలంటే వెటకారంగా మాట్లాడుతుంది కూడా!

Also Read : పల్నాడులో కొనసాగుతున్న హైటెన్షన్.. కీలక నేతలు హౌస్ అరెస్టు

అంతేకాదండోయ్..ఈ చాట్‌జీపీటీ మీకు నచ్చిన భాషలో కూడా మాట్లాడుతుంది కూడా

తను ఎలా సమాధానం చెప్పాలి.. ఎలా క్వశ్చన్స్‌ అడగాలో మీరు చెప్పవచ్చు.. మీరు ఎలా చెబితే అది అలా చేస్తుంది.. అది కూడా విత్‌ వాయిస్‌ మాడ్యులేషన్‌తో..!

ఇది కేవలం మాట్లాడుకోవడానికి మాత్రమే కాదు.. మీ పిల్లల చదువుకు కూడా ఎంతగానో ఉపయోగపడుతుంది.. మీకు టూషన్స్‌ చెబుతుంది.. మీకు ఎగ్జామ్‌ కూడా పెడుతుంది..!

ఇలా చాట్‌జీపీటీ కొత్త వెర్షన్‌ను మొత్తానికి అందరిని ప్రేమలో పడేసింది. త్వరలోనే మన అందరి ఫోన్లలోకి ఈ వెర్షన్‌ రానుంది. ఇది టెక్‌ రంగంలో పెను విప్లవాన్ని సృష్టిస్తుందనే అంచనాలు వ్యక్తం చేస్తున్నారు ఎక్స్‌పర్ట్స్‌.. ఎందుకంటే టెక్నాలజీ అంటే మనషులు భావోద్వేగాలతో సంబంధంలేనిదిగా భావిస్తారు. అయితే చాట్‌జీపీటీ వెర్షన్‌ మాత్రం హ్యూమన్‌ ఎమోషన్స్‌తో కనెక్ట్ అవుతుంది..!

#ai #chatgpt #woman-voice
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe