Chaplin Coffin Theft Story: ప్రపంచాన్ని నవ్వులతో ముంచెత్తిన వాడు.. ప్రపంచ సినిమా పై చెరగని కామెడీ సంతకాన్ని చేసిన వాడు.. దశాబ్దాలు దాటినా పేరు చెబితేనే ప్రజల పెదవులపై చిరునవ్వులు పూయించగలిగిన వాడు చార్లీ చాప్లిన్.ఇప్పటికీ ఆయన గుర్తుకువస్తే చాలు మన పెదవులపై చిరునవ్వును పూయిస్తుంది. మనిషి జీవితం నుంచే ఆయన హాస్యాన్ని పండించారు.. ఆయన సినిమా చూస్తూ ఎంత హాయిగా నవ్వుకోగలమో.. ఆ నవ్విస్తున్న సినిమా పాత్రల వెనుక విషాదం అంతే బలంగా మన హృదయాల్ని తాకుతుంది.
చార్లీ చాప్లిన్ 1977లో తన 88వ ఏట చనిపోయారు. అందరిలాగే ఆయన చనిపోయాక ఆయన శవాన్ని భూమిలో పాతేశారు. అయితే కొంతకాలం తర్వాత ఉన్నట్టుండి ఆయన శవపేటిక మాయం అయిపోయింది. అది కూడా చాప్లిన్ ఫ్యాన్సే చేశారు. ఇద్దరు చార్లీ చాప్లిన్ ఫ్యాన్ శ్మశానంలో తవ్వి ఆయన శవపేటిక ఎత్తుకెళ్ళిపోయారు. ఎందుకంటే ఆయన మెదడులోనే హాస్యం ఉందని వారు అనుకున్నారుట. ఈ ఇద్దరు దొంగలే కాదు...చాలామంది అలాగే అనుకేనేవారుట. చార్లీ చాప్లిన్ మెదడులో హాస్యం నిక్షిప్తమయిందని...అందుకే అంతలా కామెడీ చేయగలిగేవారని విశ్వసించేవారుట. ఈ కారణంగానే ఆ ఇద్దరు దొంగలు కూడా శవపేటికను ఎత్తుకెళ్ళారు. ఆ శవ పేటిక ఇవ్వాలంటే రూ.4 లక్షల పౌండ్లు (సుమారు 24 లక్షల డాలర్లు ) ఇవ్వాలనే నిబంధన విధించారు. దీంతో అప్పట్లో ఆ విషయం సంచలనం కలిగించింది.
చార్లీ చాప్లిన్‌కు నలుగురు భార్యలు. శవపేటికను ఎత్తుకెళ్ళే సమయానికి నాలుగో బార్య మాత్రమే ఉన్నారు. దొంగలు డబ్బులు ఇవ్వమని చాప్లిన్ నాలుగో భార్య ఊనాను బెదిరించారు. దీంతో ఆమె బాగా భయపడి పోయారు. పిల్లలను ఏమైనా చేస్తారేమోనని బెదిరిపోయి దొంగలు అడిగింది అంతా ఇవ్వడానికి కూడా రెడీ అయిపోయారు. అయితే ఈ విషయం ఆమె ఎవరికీ చెప్పకపోయినా బటయకు మాత్రం వచ్చేసింది. పోలీసుల దాకా వెళ్ళింది. దాంతో పోలీసులు ఐదు వారాలు కష్టపడి గాలించి దొంగలను పట్టుకున్నారు. వారిని అరెస్ట్ చేశారు.