Maoists: మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో బందోబస్తు.. భద్రాద్రి కొత్తగూడెంలో హై అలెర్ట్!

పార్లమెంట్‌ ఎన్నికలకు చర్ల మండల వ్యాప్తంగా 36 పోలింగ్‌ కేంద్రాలను అధికారులు ఏర్పాటు చేశారు. ఇందులో 60 శాతం పోలింగ్‌ కేంద్రాలు మావోయిస్టు ప్రభావిత ప్రాంతంలో ఉండటంతో భద్రతా ఏర్పాట్లు చేయడంలో పోలీస్‌ అధికారులు నిమగ్నమయ్యారు. మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో బందోబస్తు కొనసాగుతోంది.

New Update
Maoists: మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో బందోబస్తు.. భద్రాద్రి కొత్తగూడెంలో హై అలెర్ట్!

మావోయిస్టు ప్రభావిత ప్రాంతం కావడంతో భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో పోలింగ్ కార్యకలాపాలు సజావుగా సాగేందుకు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు పోలీసులు. భద్రతా చర్యలను పటిష్టం చేయడంతో పాటు ప్రాంతంలో నిఘాను పెంచారు. అంతర్-రాష్ట్ర సరిహద్దులను ఆనుకుని ఉన్న ప్రదేశాల్లో ప్రత్యేక చెక్ పోస్ట్‌లు ఏర్పాటు చేశారు. మొత్తం 36 పోలింగ్ బూత్‌ల్లో 32 బూత్‌లను హైరిస్క్ జోన్‌లుగా గుర్తించారు. ఇవి పూర్తిగా పోలీసుల ఆధినంలో ఉన్నాయి.

ఈ సారి గెలుపెవరిదో?
తెలంగాణలోని మొత్తం 17 పార్లమెంట్ స్థానాలకు మే 13న నాలుగో దశ లోక్‌సభ ఎన్నికల పోలింగ్ జరగనుంది. 2019లో 17 స్థానాల్లో 9 స్థానాలను భారత్ రాష్ట్ర సమితి (బీఆర్‌ఎస్) గెలుచుకుంది. భారతీయ జనతా పార్టీ (బీజేపీ) నాలుగు సీట్లు, కాంగ్రెస్ 3, అసదుద్దీన్ ఒవైసీకి చెందిన ఎఐఎంఐఎం ఒక్క హైదరాబాద్ సీటును గెలుచుకున్నాయి. అయితే ప్రస్తుతం బీఆర్‌ఎస్‌ ప్రతిపక్షంలో ఉంది. మాజీ ముఖ్యమంత్రి, బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ రాష్ట్రంలోని 17 స్థానాల్లో బస్సు యాత్ర చేపట్టారు. అటు తెలంగాణలో ప్రధాని నరేంద్ర మోదీ విస్తృతంగా ప్రచారం చేశారు. లోక్‌సభ ఎన్నికల నాల్గవ దశ ఎన్నికల ప్రచారానికి చివరి రోజు ముందు అంటే మే 10న తెలంగాణలో జరిగిన ర్యాలీల్లో ప్రధాని ప్రసంగించారు. ఇప్పటికే ప్రధాని, హోంమంత్రి అమిత్ షా రాష్ట్రంలో అరడజనుకు పైగా సమావేశాల్లో ప్రసంగించారు.

హైదరాబాద్‌లో టఫ్‌ ఫైట్
తెలంగాణలో హైదరాబాద్ , సికింద్రాబాద్, కరీంనగర్, చేవెళ్ల నియోజకవర్గాల్లో పోటీ కీలకంగా మారింది. హైదరాబాద్‌లో సిట్టింగ్ ఎంపీ, ఏఐఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీపై బీజేపీ క్లాసికల్ డ్యాన్సర్, పారిశ్రామికవేత్త మాధవి లతతో తలపడనున్నారు. 2004 నుంచి ఒవైసీ నాలుగు పర్యాయాలు ఈ సీటును గెలుచుకోవడంతో హైదరాబాద్ AIMIM బలమైన కోటగా ఉంది. 2014కి ముందు, ఒవైసీ తండ్రి సుల్తాన్ సలావుద్దీన్ ఒవైసీ హైదరాబాద్ నుండి ఆరు పర్యాయాలు లోక్‌సభకు ప్రాతినిధ్యం వహించారు.

Also Read: ఈసారి జగన్ కు 51 సీట్లు కూడా రావు.. ప్రశాంత్ కిషోర్ తో రవిప్రకాష్ సంచలన ఇంటర్వ్యూ

Advertisment
తాజా కథనాలు