Chardham Yatra 2024: ఉత్తరాఖండ్ చార్ ధామ్ యాత్ర నేటి నుంచి ప్రారంభమైంది. కేదార్‌నాథ్ తలుపులు ఉదయం 6:55 గంటలకు - యమునోత్రి తలుపులు 10:29 గంటలకు తెరుచుకున్నాయి. మధ్యాహ్నం 12:25 గంటలకు గంగోత్రి ధామ్ తలుపులు తెరిచారు. కాగా బద్రీనాథ్ ఆలయంలో దర్శనం మే 12 నుంచి ప్రారంభమవుతుంది. కేదార్‌నాథ్ తలుపులు తెరిచిన అనంతరం సీఎం పుష్కర్ సింగ్ ధామి తన సతీమణితో కలిసి దర్శనానికి వచ్చారు. వేలాది మంది జనం రావడంతో తొలిరోజే ఇక్కడ గందరగోళం నెలకొంది.
Chardham Yatra 2024: ఈ నాలుగు ధామ్‌ల వద్ద పగటి ఉష్ణోగ్రత 0 నుంచి 3 డిగ్రీల వరకు నమోదవుతోంది. అదే సమయంలో, టెంపరేచర్ రాత్రికి మైనస్‌కు చేరుకుంటుంది. ఇదిలావుండగా, కేదార్‌నాథ్ ధామ్‌కు 16 కి.మీ ముందున్న గౌరీకుండ్‌కు సుమారు 10 వేల మంది భక్తులు చేరుకున్నారు.
Chardham Yatra 2024: గతేడాది ఈ సంఖ్య 7 నుంచి 8 వేల మధ్య ఉంది. ఇక్కడ దాదాపు 1500 గదులు ఉన్నాయి. నమోదైన 5,545 మ్యూల్స్ బుక్ అయ్యాయి. 15 వేల మందికి పైగా ప్రయాణికులు హరిద్వార్ అలాగే, రిషికేశ్ చేరుకున్నారు. ఇప్పటి వరకు 22.15 లక్షల మంది భక్తులు చార్ ధామ్ యాత్రకు రిజిస్టర్ చేసుకున్నారు. గతేడాది రికార్డు స్థాయిలో 55 లక్షల మంది సందర్శించారు.
కేదార్‌నాథ్-బద్రీనాథ్ ఆలయ కమిటీ ఛైర్మన్ అజయేంద్ర అజయ్ తెలిపిన వివరాల ప్రకారం.. మే 9వ తేదీ సాయంత్రం 4 గంటలకు బాబా పంచముఖి డోలీ కేదార్‌ధామ్‌కు చేరుకునేటప్పుడు 5 వేల మంది హాజరయ్యారు. మరోవైపు, నిన్న మధ్యాహ్నం 12 గంటలకు, గంగామాత ఊరేగింపు శీతాకాల విడిది సందర్భంగా ముఖ్వా నుండి గంగోత్రి ధామ్‌కు బయలుదేరింది. భైరవఘాటిలో రాత్రి విశ్రాంతి కోసం డోలి ఆగింది. ఈరోజు ఉదయం 6:30 గంటలకు డోలి మళ్లీ ధామ్‌కి బయలుదేరింది. ఇక్కడ తలుపులు 12:25కి తెరుచుకున్నాయి.
Also Read: మద్యం కేసులో మరో ట్విస్ట్.. ఛార్జ్‌షీట్‌లో ‘ఆప్’ పేరును చేర్చనున్న ఈడీ
Chardham Yatra 2024: తొలిసారిగా భక్తుల సంఖ్య పరిమితంచేశారు. దీంతో కేదార్‌నాథ్‌ను రోజుకు 15 వేల మంది మాత్రమే దర్శించుకోగలుగుతారు, గతేడాది రికార్డు స్థాయిలో 55 లక్షల మంది రావడంతో ఏర్పాట్లకు ఆటంకం ఏర్పడింది. దీని నుండి గుణపాఠం తీసుకుంటూ, ఉత్తరాఖండ్ పోలీసులు - పర్యాటక శాఖ మొదటిసారిగా చార్ ధామ్ యాత్రలో రోజువారీ భక్తుల సంఖ్యను పరిమితం చేసింది. గతేడాది నాలుగు ధామాల్లో దర్శనం కోసం రోజుకు 60 వేల మందికి పైగా యాత్రికులు వచ్చేవారు.
Chardham Yatra 2024: పర్యాటక శాఖ కార్యదర్శి సచిన్ కుర్వే ప్రకారం, కేదార్‌నాథ్ ధామ్‌ను రోజుకు 15 వేల మంది, బద్రీనాథ్ ధామ్‌ను 16 వేల మంది, యమునోత్రిని 9 వేల మంది భక్తులు, 11 వేల మంది భక్తులు దర్శించుకోగలుగుతారు. అంటే రోజుకు మొత్తం 51 వేల మంది చార్ ధామ్‌ను సందర్శించనున్నారు.
రాత్రి 12 గంటలకు పూజారి గుడిలోకి..
Chardham Yatra 2024: ప్రతి సంవత్సరం తలుపులు తెరవడానికి ముందు, ప్రధాన పూజారి రాత్రి 12 గంటలకు ఆలయంలోకి ప్రవేశిస్తారని చెబుతున్నారు. 5-6 వేద బ్రాహ్మణులతో పాటు ప్రధాన పూజారి ఆ సమయంలో ఆలయం లోకి వెళతారు. అప్పుడు గర్భగుడిలోని పంచముఖి విగ్రహం నుండి మంత్రాల ద్వారా జ్యోతిర్లింగంలో జీవితం పునరుద్ధరిస్తారు. గర్భగుడిని శుభ్రం చేస్తారు. స్వామివారి షోడశోపచార పూజ అనంతరం ప్రజల దర్శనానికి తలుపులు తెరుస్తారు.
256 మంది నిపుణులతో సహా 400 మంది వైద్యులు
Chardham Yatra 2024: చార్ ధామ్ యాత్ర మార్గంలో తొలిసారిగా 400 మందికి పైగా వైద్యులను నియమించారు. వీరిలో 256 మంది ఎమర్జెన్సీ మెడికల్ ఆఫీసర్లు, స్పెషలిస్ట్ డాక్టర్లు ఉన్నారు. అయినప్పటికీ, భక్తులు ప్రయాణ సమయంలో కనీసం 7 రోజులు ప్లాన్ చేసుకోవాలి, తద్వారా శరీరం పెరుగుతున్న- తగ్గుతున్న ఉష్ణోగ్రతలకు అలవాటుపడుతుంది.
మొత్తం నాలుగు ధామ్‌లు 3 వేల మీటర్ల ఎత్తులో ఉన్నాయని, పర్వతాలపై అడపాదడపా మంచు కురుస్తోందని ఉత్తరాఖండ్ ఆరోగ్య శాఖ సలహాలో తెలిపింది. అందుకోసం భక్తులు 7 రోజులపాటు ప్రణాళిక రూపొందించుకోవాలి అని అధికారులు చెప్పారు.
కేదార్‌నాథ్ వరకు సూపర్‌ఫాస్ట్ నెట్‌వర్క్:
Chardham Yatra 2024: కేదార్‌నాథ్ మొత్తం ట్రాక్‌లో 4G మరియు 5G నెట్‌వర్క్ అందుబాటులో ఉంటుంది. ఇందుకోసం 4 టవర్లను ఏర్పాటు చేశారు. గత సంవత్సరం, ఈ ట్రాక్‌లో కొన్ని చోట్ల మాత్రమే నెట్‌వర్క్ అందుబాటులో ఉంది. మీరు ఆలయంలో వై-ఫైని ఉపయోగించాలనుకుంటే, మీరు ప్రభుత్వ స్లిప్ పొందవలసి ఉండేది. కానీ ఇప్పుడు అక్కడ కూడా సూపర్‌ఫాస్ట్ నెట్‌వర్క్ ఉంటుంది.
రెండు ధాముల్లో ఆన్‌లైన్ పూజ బుకింగ్ జూన్ 30 వరకు..
Chardham Yatra 2024: బద్రీనాథ్-కేదార్‌నాథ్ ఆలయ కమిటీ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ యోగేంద్ర సింగ్ ప్రకారం, ఈసారి ఆన్‌లైన్ పూజ జూన్ 30 వరకు మాత్రమే జరుగుతుంది. ఇందులో శ్రీమద్ భగవత్ పఠనానికి 51 వేల రూపాయలు చెల్లించాల్సి ఉంటుంది. అలా మహాభిషేకానికి రూ.12 వేలుగా నిర్ణయించారు.