Revanth Reddy: రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకార సమయంలో మార్పులు.. మళ్లీ ఎప్పుడంటే..

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గురువారం నాడు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. అయితే, ఆయన ప్రమాణ స్వీకారం సమయంలో స్వల్ప మార్పులు చోటు చేసుకున్నాయి. ఉదయం 10.28 కి బదులుగా మధ్యాహ్నం 1.04 గంటలకు ప్రమాణం చేయనున్నారు.

New Update
Revanth Reddy: రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకార సమయంలో మార్పులు.. మళ్లీ ఎప్పుడంటే..

Telangana CM: గురువారం నాడు తెలంగాణ (Telangana) నూతన ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి (Revanth Reddy) ప్రమాణ స్వీకారం చేయనున్నారు. అయితే, ఈ ప్రమాణ స్వీకారం సమయంలో స్వల్ప మార్పులు చోటు చేసుకున్నాయి. గురువారం మధ్యాహ్నం 1:04 గంటలకు ఎల్బీ స్టేడియంలో రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేయనున్నారు. వాస్తవానికి గురువారం ఉదయం 10:28 గంటలకు ప్రమాణ స్వీకార సమయాన్ని ఖరారు చేశారు. అయితే, కాంగ్రెస్ పార్టీ (Congress Party)అగ్రనేతలను ఆహ్వానించి నేపథ్యంలో, ఇతర కారణాల వల్ల ప్రమాణ స్వీకార సమయాన్ని మార్చారు.

ఇక రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారోత్సవానికి ఎల్బీ స్టేడియంలో భారీగా ఏర్పాట్లు చేస్తున్నారు అధికారులు. రేవంత్ ప్రమాణ స్వీకారోత్సవానికి కాంగ్రెస్ అగ్రనేతలు సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంక, మల్లికార్జున ఖర్గే, కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు సహా పలువురు ప్రముఖులు హాజరుకానున్నారు. ఎల్బీనగర్ స్టేడియం వేదికగా నాడు దివంగత నేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేస్తే.. నేడు రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. 2004లో ఎల్బీ స్టేడియం వేదికగానే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా వైఎస్ రాజశేఖర్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేశారు. మళ్లీ ఇన్నాళ్లకు కాంగ్రెస్ అభ్యర్థి ముఖ్యమంత్రిగా ఎల్బీనగర్ స్టేడియంలో ప్రమాణ స్వీకారం చేస్తుండటంతో భారీగా ఏర్పాట్లు చేస్తున్నారు.

Also Read:

ఆ పదవికి రాజీనామా చేయనున్న రేవంత్ రెడ్డి..!

మంగళవారం నాడు కాంగ్రెస్ అధిష్టానం రేవంత్ రెడ్డిని ముఖ్యమంత్రి అభ్యర్థిగా ఖరారు చేసిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఢిల్లీకి వెళ్లిన రేవంత్ రెడ్డి.. తన ప్రమాణ స్వీకారోత్సవానికి రావాల్సిందిగా కాంగ్రెస్ అగ్ర నేతలందరినీ ఆహ్వానించారు. సోనియా గాంధీ, రాహుల్, ప్రియాంక, మల్లికార్జున ఖర్గే, కేసీ వేణుగోపాల్, డీకే శివకుమార్, కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు సహా పలువురు ప్రముఖులను రేవంత్ రెడ్డి ఆహ్వానించారు.

హమ్మయ్య.. రికార్డ్ స్థాయిలో తగ్గిన బంగారం ధర.. ఎంత తగ్గిందంటే..

Advertisment
తాజా కథనాలు