Telangana Government : జీవోలు, నోటిఫికేషన్లు, నివేదికలు, లెటర్ హెడ్లలో టీజీగా ఉండాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నాతెలంగాణ సంక్షిప్త పదాన్ని టీఎస్(TS) కు బదులు టీజీ(TG) గా మార్చాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి(Santhi Kumari) శుక్రవారం సాయంత్రం ఉత్తర్వులు జారీ చేశారు.. ప్రభుత్వ శాఖలు, సంస్థలు, అటానమస్ విభాగాలన్నీ ఈ ఆదేశాలన్ని పాటించాలని సూచించారు.
తెలంగాణ ఉద్యమం సమయంలో సంక్షిప్తంగా టీజీని ఉపయోగించారు. తమ వాహనాలపై నాడు ఏపీకి బదులు టీజీ అని రాసుకున్నారు. ఆ తర్వాత అధికారంలోకి వచ్చిన బీఆర్ఎస్ ప్రభుత్వం గతంలో తెలంగాణను సంక్షిప్తంగా టీఎస్‌గా మార్చింది. కాంగ్రెస్(Congress) అధికారంలోకి వచ్చాక ఇప్పుడు టీజీగా మార్చింది.