Telangana : తెలంగాణ ప్రభుత్వం కీలక ఆదేశాలు!

తెలంగాణ సంక్షిప్త పదాన్ని టీఎస్‌ కు బదులు టీజీగా మార్చాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి శుక్రవారం సాయంత్రం ఉత్తర్వులు జారీ చేశారు. జీవోలు, నోటిఫికేషన్లు, నివేదికలు, లెటర్ హెడ్‌లలో టీజీగా ఉండాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.

New Update
Telangana : తెలంగాణ ప్రభుత్వం కీలక ఆదేశాలు!

Telangana Government :  జీవోలు, నోటిఫికేషన్లు, నివేదికలు, లెటర్ హెడ్‌లలో టీజీగా ఉండాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నాతెలంగాణ సంక్షిప్త పదాన్ని టీఎస్‌(TS) కు బదులు టీజీ(TG) గా మార్చాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి(Santhi Kumari) శుక్రవారం సాయంత్రం ఉత్తర్వులు జారీ చేశారు.. ప్రభుత్వ శాఖలు, సంస్థలు, అటానమస్ విభాగాలన్నీ ఈ ఆదేశాలన్ని పాటించాలని సూచించారు.

తెలంగాణ ఉద్యమం సమయంలో సంక్షిప్తంగా టీజీని ఉపయోగించారు. తమ వాహనాలపై నాడు ఏపీకి బదులు టీజీ అని రాసుకున్నారు. ఆ తర్వాత అధికారంలోకి వచ్చిన బీఆర్ఎస్ ప్రభుత్వం గతంలో తెలంగాణను సంక్షిప్తంగా టీఎస్‌గా మార్చింది. కాంగ్రెస్(Congress) అధికారంలోకి వచ్చాక ఇప్పుడు టీజీగా మార్చింది.

Also read: త్వరలో తెలంగాణ పంచాయతీ ఎన్నికలు..?

Advertisment
తాజా కథనాలు