ISRO: నేల మీదకు జాబిల్లి..చంద్రయాన్ 4,5 లక్ష్యం

చంద్రయాన్ 3 సక్సెస్ తర్వాత భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ చంద్రయాన్ 4, 5 మీద దృష్టి పెట్టింది. వీటి ద్వారా భూమి మీదకు జాబిల్లిని తీసుకురావడమే లక్ష్యమని చెబుతున్నారు ఇస్రో ఛైర్మన్ ఎస్ సోమనాథ్. 2028లో వీటిని ప్రయోగించనున్నారు.

చంద్రయాన్-3 లాంచింగ్ విజయవంతం.. ఇస్రో ఖాతాలో మరో మైలురాయి
New Update

Chandrayan-4,5: భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ ఇస్రో తమ నెక్ట్స్ ప్రయోగాలకు సిద్ధం అవుతోంది. చంద్రయాన్ –3 సక్సెస్ అవడంతో మరిన్ని మూన్ మిషన్లను చంద్రుని మీదకు పంపించాలని నిర్ణయించుకుంది. వీటి కోసం తయారీ కూడా మొదలుపెట్టేసింది. చంద్రయాన్ 4, 5 మిషన్లకు సంబంధించిన డిజైన్లు ఇప్పటికే పూర్తయ్యాయని ఇస్రో ఛైర్మన్ ఎస్ సోమనాథ్ తెలిపారు. ఇవి రెండు చంద్రయాన్–3కు కొనసాగింపుగా ఉంటాయని ఆయన చెప్పారు.

చంద్రయాన్‌-4 ప్రయోగాన్ని 2028లో నిర్వహించాలనేది ఇస్రో లక్ష్యంమని చెప్పారు ఛైర్మన్ సోమనాథ్. చంద్రుఇ ఉపరితలంపై నుంచి శిలలు, మట్టి నమూనాలను సేకరించి వాటిని భూమి మీదకు తీసుకురావడమే లక్ష్యమని అన్నారు. అలా తీసుకొచ్చిన వాటి మీద సమగ్ర విశ్లేషణ చేస్తామని చెప్పారు.ఇదే చంద్రయాన్‌-4 ప్రధాన లక్ష్యమని తెలిపారు. ఇందులో ల్యాండర్‌, అసెండర్‌, ట్రాన్స్‌ఫర్‌ మాడ్యూల్‌, రీ ఎంట్రీ మాడ్యూల్‌ వంటి కీలక భాగాలు ఉంటాయని చెప్పారు. ల్యాండర్‌‌ చంద్రుడి మీద దిగుతుంది. అదే ఉపరిలం మీద నుంచి నమూనాలను సేకరిస్తుంది. ఇక అసెండర్ సేకరించిన నమూనాలను చంద్రుడి కక్ష్యలోకి తీసుకెళుతుంది. అసెండర్‌ తీసుకొచ్చిన నమూనాలను ఈ ట్రాన్స్‌ఫర్‌ మాడ్యూల్‌ రీ ఎంట్రీ మాడ్యూల్‌కు తరలించడం ట్రాన్స్‌ఫర్ మాడ్యూల్ బాధ్యతని వివరించారు. రీ ఎంట్రీ మాడ్యూల్‌ చంద్రుడిపై సేకరించి న శాంపిళ్లను భూమిపైకి చేరుస్తుందని తెలిపారు.

ఇక చంద్రయాన్‌‌–5 గురించి చెబుతూ దీనిని భారత్ దీనిని జపాన్‌తో కలిసి సంయక్తంగా చేపడుతుందని చెప్పారు ఛైర్మన్ సోమనాథ్. ఇందులో దీనిద్వారా చంద్రుని మీద ఎప్పుడూ నీడలోనే ఉండే మంచు ప్రాంతాలను అన్వేషిస్తాము. ఈ మిషన్‌లో ఇస్రో రూపొందించిన ల్యాండర్‌తోపాటు జపాన్‌ అభివృద్ధి చేసిన 350 కిలోల రోవర్‌ కీలక పాత్ర పోషిస్తాయి. చంద్రుడి పై సవాళ్లతో కూడిన ప్రాంతాలను అన్వేషించడానికి వీలుగా వీటిని ప్రత్యేకంగా అభివృద్ధి చేస్తున్నామని తెలిపారు.

Also Read: PM Modi: భారత్‌ది ఎప్పుడూ శాంతి మార్గమే‌‌–ప్రధాని మోదీ

#isro #moon #chandrayan #space-rocket
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe