జాబిల్లికి 30కిలోమీటర్ల దూరంలో చంద్రయాన్‌-3..ఎక్కడా తగ్గట్లేదుగా!

చంద్రయాన్-3 మిషన్ తుది దశకు చేరుకుంది. చంద్రునికి కి అత్యంత సమీపంలో ఉన్న కక్ష్యలో ఉంది. మరో 4 రోజుల్లో విక్రమ్ ల్యాండర్ సాఫ్ట్ ల్యాండింగ్ అవుతుంది. జాబిల్లికి అతి సమీపం నుంచి చంద్రయాన్-3 క్లిక్ మనిపించిన ఫొటోలను, వీడియోలను పంపించింది. ఇప్పటివరకు చంద్రయాన్‌-3 ప్రయాణాన్ని చూస్తుంటే..చంద్రుడిపై మన త్రివర్ణ పతాకం సగర్వంగా ఎగిరే రోజు ఎంతో దూరంలో లేదని చెప్పొచ్చు.

జాబిల్లికి 30కిలోమీటర్ల దూరంలో చంద్రయాన్‌-3..ఎక్కడా తగ్గట్లేదుగా!
New Update

చంద్రయాన్‌-3 సాఫ్ట్‌ ల్యాండింగ్‌కు మరో 4 రోజులు మాత్రమే మిగిలి ఉంది. ల్యాండర్‌ డీ బూస్టింగ్‌ ప్రక్రియతో పాటు..ఈ నాలుగు రోజులు ల్యాండర్‌, ప్రజ్ఞాన్‌ రోవర్‌లకు చాలా కీలకం. ఈ ప్రయాణంలో చంద్రయాన్‌ ఎన్నో క్లిష్టమైన సవాళ్లను దాటి అత్యంత చేరువలోకొచ్చేసింది. చంద్రునిపై మన త్రివర్ణ పతాకాన్ని ఎగరవేసేందుకు సిద్ధమైంది. ప్రతి క్లిష్టమైన ప్రక్రియను దాటుకుంటూ చంద్రునికి అతి సమీపంలోకి చేరువైంది మన చంద్రయాన్‌-3. నిన్న(ఆగస్టు 18) ఈ మిషన్‌లో మరో విజయం సాధించింది. విక్రమ్‌ ల్యాండర్‌ డీ బూస్టింగ్‌ ప్రక్రియ సక్సెసైంది. అంటే అంతరిక్ష నౌక వేగం తగ్గింది.



డీ బూసింగ్‌ బూస్ట్:

ఇవాళ(ఆగస్టు 19) మరోసారి డీ బూస్టింగ్‌ ప్రక్రియను చేపడతారు. ఆ తర్వాత చంద్రునికి 30కిలోమీటర్ల దూరంలోకి చేరుతుంది విక్రమ్‌ ల్యాండర్‌. అక్కడి నుంచి విక్రమ్ చంద్రునిపై ఫైనల్ ల్యాండింగ్ కు ప్రయత్నాలు చేస్తుందన్నారు.ఆ తర్వాత ఆగస్ట్‌ 23న చంద్రుని ఉపరితలంపై దిగుతుంది. ఐతే దానికి ముందు ల్యాండర్‌ వేగం సెకనుకు 2 కిలోమీటర్ల నుంచి సున్నాకు తగ్గిస్తారు. అది చాలా సంక్లిష్టమైన, కీలకమైన ప్రక్రియ. ఇక అక్కడి నుంచి ఈ మిషన్‌కు సూర్యుని సాయం అవసరమవుతుంది. 23న సాయంత్రం 5.30గంటలకు చంద్రుని దక్షిణ ధృవంపై విక్రమ్‌ సాఫ్ట్‌ ల్యాండింగ్‌ అవుతుందని అంచనా వేస్తున్నారు. విక్రమ్‌ ల్యాండర్‌ తన మిషన్‌ను ముందుకు తీసుకెళ్లేందుకు సూర్యుని కాంతి, శక్తిని ఉపయోగిస్తుంది.



ట్విట్టర్‌లో వైరల్‌గా ఫొటోలు:

ఈ మిషన్‌లో ప్రజ్ఞాన్ రోవర్‌ 14రోజుల పాటు తన బాధ్యతలను నిర్వర్తిస్తుంది. రెండు రోవర్లు విద్యుత్‌ ఉత్పత్తికి సోలార్‌ ప్యానెల్స్‌ను ఉపయోగిస్తాయి. ప్రస్తుతం చంద్రునిపై రాత్రి కాగా..23న సూర్యోదయం ఉంటుంది. తాజాగా విక్రమ్‌ ల్యాండర్‌ తీసిన చిత్రాలను ఇస్రో తన ట్విట్టర్‌లో పోస్ట్‌ చేసింది. వాటిని బట్టి విక్రమ్‌ ల్యాండర్‌ చంద్రునికి చాలా దగ్గరకు చేరువైనట్టు తెలుస్తోంది. ఇక ఆగస్ట్‌ 17న ప్రొపల్షన్‌ మాడ్యూల్‌ నుంచి ల్యాండర్ మాడ్యూల్‌ను వేరు చేశారు. చంద్రయాన్‌-3 ల్యాండర్‌ ఇమేజ్‌లో అమర్చిన కెమెరా-1 నుంచి ఈ చిత్రాలను తీసింది. ఇందులో చంద్రుని ఉపరితలం స్పష్టంగా కనిపిస్తోంది. మన విక్రమ్‌ ల్యాండర్‌ చంద్రునికి చాలా దగ్గరగా తిరుగుతోంది. ఈసారి ఎలాంటి సమస్య లేకుండా ల్యాండింగ్‌ చేసేందుకు ఇస్రో ఏర్పాట్లు చేసింది. చంద్రయాన్‌-2 చంద్రునికి 2 కిలోమీటర్ల దూరంలో ఉండగా..ఆ మిషన్‌ క్రాష్ ల్యాండయింది. ఐతే ఆ ప్రయోగం నేర్పిన పాఠాలతో ఈసారి ల్యాండర్‌ టెక్నాలజీలో పెను మార్పులు చేసి చంద్రయాన్‌-3 ప్రయోగం చేపట్టింది ఇస్రో.



గర్వించే రోజు దగ్గరలోనే ఉంది బాసూ:

విక్రమ్‌ ల్యాండర్‌ లెగ్స్‌ను చాలా స్ట్రాంగ్‌గా తయారుచేశారు. కానీ ఏదైనా పెద్ద గోతిలో దిగాల్సి వస్తే మాత్రం ఇబ్బందులొచ్చే అవకాశముంది. ఇక ల్యాండర్‌ వెలుపల ప్రత్యేక కెమెరాలు ఏర్పాటు చేశారు. దీన్ని LDF అంటారు. ఆ లేజర్‌ కాంతి నిరంతరం చంద్రుడిని తాకుతుంది. ఇస్రో కంట్రోల్‌ రూమ్‌ నుంచి చంద్రయాన్‌-3ని పర్యవేక్షిస్తున్నారు సైంటిస్టులు. ఇప్పటివరకు చంద్రయాన్‌-3 ప్రయాణాన్ని చూస్తుంటే..చంద్రుడిపై మన త్రివర్ణ పతాకం సగర్వంగా ఎగిరే రోజు ఎంతో దూరంలో లేదని చెప్పొచ్చు.

#chandrayaan #chandrayaan-3-moon-landing #chandrayaan-3
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe