చంద్రయాన్ నుంచి మరో కీలక అప్ డేట్.... చంద్రునిపై ఉష్ణోగ్రత వివరాలు వెల్లడించిన ఇస్రో...!

చంద్రుని ఉపరితలంపై ఉష్ణోగ్రతలకు సంబంధించిన కీలకమైన విషయాలను చంద్రయాన్-3 ఇస్రోకు అందించింది. దీని ప్రకారం చంద్రుని ఉపరితలంపై లోతుని బట్టి ఉష్ణోగ్రత మారుతూ వుందని పేర్కొంది. చంద్రుని ఉపరితలంపై -10 డిగ్రీల సెల్సియస్ నుంచి 60 డిగ్రీల సెల్సియస్ వరకు మారుతూ వున్నట్టు పేర్కొంది. మరికొన్ని వివరాలు ఇప్పుడిప్పుడే అందుతున్నాయని తెలిపింది.

author-image
By G Ramu
New Update
చంద్రయాన్ నుంచి మరో కీలక అప్ డేట్.... చంద్రునిపై ఉష్ణోగ్రత వివరాలు వెల్లడించిన ఇస్రో...!

చంద్రయాన్-3(Chandrayan-3) మరో కీలక అప్ డేట్ ఇచ్చింది. చంద్రుని(moon) దక్షిణ ధ్రువంపై వున్న ఉష్ణోగ్రతల(temparatures)ను విక్రమ్ ల్యాండర్ లోని సీహెచ్ఏఎస్టీఈ(chandras thermophysical experiment)పేలోడ్ రికార్డు చేసిందని ఇస్రో వెల్లడించింది. ఈ మేరకు విక్రమల్ ల్యాండర్ పంపించిన గ్రాఫ్ ను ట్విట్టర్ లో ఇస్రో షేర్ చేసింది. చంద్రుని ఉపరితలంపై లోతును బట్టి ఉష్ణోగ్రత వ్యత్యాసాలు ఎలా వున్నాయో చెబుతుందని పేర్కొంది.

చంద్రుని ఉపరితలంపై 10 మీటర్ల లోతులో ప్రజ్ఞాన్ రోవర్ పరిశోధనలు చేసింది. ఈ గ్రాఫ్ ప్రకారం చంద్రుని ఉపరితలంపై లోతున బట్టి ఉష్ణోగ్రతలు -10 డిగ్రీల సెల్సియస్ నుంచి 60 డిగ్రీల సెల్సియస్ వరకు మారుతున్నట్టు గ్రాఫ్ ద్వారా తెలుస్తోంది. చంద్రునిపై దక్షిణ ధ్రువంలో నిర్వహించిన మొదటి ప్రొఫైల్ టెస్టు అని ఇస్రో పేర్కొంది. దీనికి సంబంధించి పూర్తి వివరాలు ఇప్పుడిప్పుడే అందుతున్నాయని చెప్పింది.

ChaSTE పే లోడ్ లో కంట్రోల్డ్ పెనట్రేషన్ మెకానిజం ఏర్పాటు చేయబడింది. ఈ మెకానిజం వల్ల అది చంద్రుని ఉపరితలంపై 10 మీటర్ల లోతు వరకు వెళ్లి పరిశోధనలు చేయగలదు. దీనికి 10 సెన్సార్లు కూడా ఏర్పాటు చేశారు. ఇది ఇలా వుంటే చంద్రయాన్-3 లో మొత్తం ఏడు పే లోడ్స్ వున్నాయి. అందులో విక్రమ్ ల్యాండర్ లో 4 పే లోడ్స్ వున్నాయి.

ప్రజ్ఞాన్ రోవర్ లో మరో రెండు పేలోడ్స్, ప్రపల్షన్ మాడ్యుల్ పేలోడ్ ఉంది. పలు శాస్త్రీయ ప్రయోగాలు చేసేందుకు అనుకూలంగా ఈ పేలోడ్స్ ను రూపొందించారు. విక్రమలో ChaSTE పే లోడ్ తో పాటు రాంబా(చంద్రునిపై అయాన్లు ,ఎలక్ట్రాన్లు), ఐఎల్ఎస్ఏ(భూకంపాలను), ఎల్ఆర్ఏ(చంద్రుని వ్యవస్థ గతిశీలతను) అధ్యయనం చేసే పేలోడ్స్ వున్నాయి. ఆయా పేలోడ్స్ నుంచి త్వరలో మరికొన్ని ఫలితాలు వస్తాయని, వాటిని వివరాలు త్వరలోనే వెల్లడిస్తామని ఇస్రో పేర్కొంది.

Advertisment
తాజా కథనాలు