ISRO: ఇస్రో మరో విజయం.. జాబిల్లి కక్ష్య నుంచి భూకక్ష్య దిశగా ప్రొపల్షన్ మాడ్యుల్..

ఇస్రో మరో విజయాన్ని సొంతం చేసుకుంది. చంద్రయాన్-3 ప్రాజెక్టులో భాగంగా ప్రయోగించిన ప్రొపల్షన్ మాడ్యుల్‌ను చంద్రుని కక్ష్య నుంచి భూ కక్ష్య వరకు మళ్లించినట్లు ఇస్రో ప్రకటన చేసింది. కక్ష్య పొడగింపు, ట్రాన్స్ ఎర్త్ ఇంజెక్షన్ విన్యాసాలతో దీన్ని పూర్తి చేసినట్లు పేర్కొంది.

New Update
ISRO: ఇస్రో మరో విజయం.. జాబిల్లి కక్ష్య నుంచి భూకక్ష్య దిశగా ప్రొపల్షన్ మాడ్యుల్..

Chandrayaan-3 Propulsion Module: భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ISRO) చంద్రయాన్-3 ప్రాజెక్టులో భాగంగా మరో కీలక పురోగతిని సాధించింది. ఇటీవల జబిల్లి కక్ష్యలోకి పరికరాలను పంపించిన ఇస్రో.. ఇప్పుడు వాటిని వెనక్కి తీసుకొచ్చేందుకు దృష్టి సారించింది. అయితే ఇటీవలే చంద్రయాన్ 3 ప్రాజెక్టులో భాగంగా ప్రయోగించిన ప్రొపల్షన్ మాడ్యుల్‌ను చంద్రుని కక్ష్య నుంచి భూ కక్ష్య వరకు మళ్లించినట్లు ఇస్రో ప్రకటన చేసింది. దీనివల్ల ఈ ప్రాజెక్టు మరిన్ని ఫలితాలు అందించినట్లు కనిపిస్తోంది. తాజాగా ఇందుకు సంబంధించిన సమాచారన్ని ఎక్స్‌లో (ట్విట్టర్‌)లో ఇస్రో పంచుకుంది. కక్ష్య పొడగింపు, ట్రాన్స్ ఎర్త్ ఇంజెక్షన్ విన్యాసాలతో దీన్ని పూర్తి చేసినట్లు పేర్కొంది.

Also read: మాథ్స్ స్టూడెంట్స్ కూడా డాక్టర్ కావొచ్చు.. ఈ ఏడాది నుంచే ఆ అదిరిపోయే ఛాన్స్!

వాస్తవానికి ఇస్రో.. ప్రొపల్షన్‌ మాడ్యూల్‌ మార్గాన్ని జాగ్రత్తగా ప్లాన్ చేసింది. అందుకే దాదాపు 100 కిలోల ఇంధనం అందులో మిగిలిపోయింది. దీన్ని వినియోగించుకుని ఇప్పటికే పలు పరిశోధనలు పూర్తి చేశారు. ఆ తర్వాత జాబిల్లి కక్ష్య నుంచి దీని మర్గన్ని భూ కక్ష్య వైపుగా మళ్లించారు. అయితే దీనిపై ఉన్న పేలేడ్‌ భూమిపై పరిశోధనలు చేయనుంది. 36 వేల కిలోమీటర్ల ఎత్తులో భూమి జియో బెల్ట్‌లోకి ప్రవేశించే సమయంలో.. దిగువ కక్ష్యలోకి వచ్చే సమయంలో ఉపగ్రహాలను ఢీకొట్టకుండా అక్టోబర్‌లోనే ప్లాన్ వేశారు.

చంద్రయాన్‌-3లోని (Chandrayaan-3 Mission) మూడు ప్రధాన భాగాలు ఉన్నాయి. అందులో ప్రొపల్షన్ మాడ్యుల్‌తో పాటు ల్యాండర్, రోవర్‌లు కూడా ఉన్నాయి. ప్రొపల్షన్ మాడ్యుల్ ల్యాండర్‌తో అనుసంధానమై ఉంటుంది. ఇది వాహక నౌక నుంచి విడిపోయి.. ల్యాండర్‌ మాడ్యుల్‌ను చంద్రునికి 100 కిలోమీటర్ల దగ్గరికి తీసుకెళ్లింది. ఆ తర్వాత ప్రొపల్షన్ మాడ్యుల్ నుంచి ల్యాండర్ విడిపోయింది. కానీ ప్రొపల్షన్ మాడ్యుల్ మాత్రం కొన్ని నెలల పాటు కక్ష్యలోనే ఉండిపోయింది. అయితే ఇందులో ఉన్న పరికరం సాయంతో సమాచారాన్ని సేకరించి శాస్త్రవేత్తలకు పంపింది.

Also Read: సీఎం రేసులోకి దామోదర్ రాజనర్సింహ.. ఆయన ప్లస్ పాయింట్లు ఇవే!

Advertisment
తాజా కథనాలు