ఆరు రోజులు.. మూడు విజయాలు.. వేల జ్ఞాపకాలు..భారతీయుల గుండెల్లో ఈ వారం పదిలం! ఇండియా సత్తా అంటే ఇలా ఉంటుంది బ్రో.. అని చెప్పుకునే విధంగా గడిచాయి ఈ ఆరు రోజులు. చంద్రయన్-3, ప్రజ్ఞానంద, నీరజ్ చోప్రా సాధించిన ఘనతలతో భారతీయుల ఆనందానికి హద్దే లేకుండాపోయింది. జాబిల్లి దక్షిణ ధృవంపై చంద్రయాన్-3 అడుగుపెట్టడం.. చెస్ ప్రాడజీ ప్రజ్ఞానంద సిల్వర్ మెడల్ సాధించడం.. ప్రపంచ అథ్లెటిక్స్ ఛాంపియన్‌షిప్‌లో నీరజ్ చోప్రా గోల్డ్ గెలవడం ఈ ఆరు రోజుల్లోనే జరగడం భారతీయులను ఖుషీ చేసింది. By Trinath 28 Aug 2023 in స్పోర్ట్స్ టాప్ స్టోరీస్ New Update షేర్ చేయండి మంచి రోజులుంటే ఇలానే ఉంటాయేమో.. ఒక్కటి కాదు రెండు కాదు.. ఈ ఆరు రోజుల్లో జరిగిన మూడు విషయాలు ఇండియన్స్‌ని ఆనందంలో ముంచెత్తాయి. గర్వ పడేలా చేశాయి. ప్రపంచం ముందు కాలర్ ఎగరేసుకునేలా చేశాయి. ఇండియా అంటే ఇదిరా అని సగర్వంగా చెప్పుకునేలా చేశాయి. చంద్రయన్-3తో మొదలైన భారతీయుల సంతోషం.. ఈ అర్థరాత్రి నీరజ్ చోప్రా విజయం వరకు కొనసాగింది. మధ్యలో చెస్ చిచ్చరపిడుగు ప్రజ్ఞానంద మెరిపించాడు.. ఓడిపోయినా అందరి మనసులను గెలుచుకున్నాడు.. ప్రపంచ చెస్‌ని భవిష్యత్‌లో ఏలేది భారతీయుడేనని సంకేతాలు పంపాడు. 🚨 Official glimpse of Pragyan rover coming out of lander. @isro #Chandrayaan3 pic.twitter.com/oq7kG3gfMX — Indian Tech & Infra (@IndianTechGuide) August 25, 2023 ఆగస్టు 23- చంద్రయన్-3: ఈ రోజును దేశం మొత్తం జీవితంతాం గుర్తుపెట్టుకుంటుంది. జాబిల్లిపై ప్రపంచ దేశాలకు అందని ద్రాక్షగా మిగిలిపోయిన దక్షిణ ధృవంపై ఇస్రో ప్రయోగించిన చంద్రయాన్-3(chandrayaan-3) అడుగుపెట్టిన రోజు ఇది. ఆ రోజు సాయంత్రం 6 గంటల 04 నిమిషాలకు జాబిల్లిపై చంద్రయాన్-3 ల్యాండర్ కాలు మోపింది. ఆ తర్వాత ల్యాండర్ నుంచి దిగిన రోవర్ చంద్రుడిపై పరుగులు పెట్టింది. ఈ క్షణం కోసం యావత్ భారతావనీ ఎదురుచూసింది. అందరు తమ పనులను పక్కనపెట్టి మరి చంద్రయన్-3 ల్యాండింగ్‌ని టీవీల్లో వీక్షించారు. ఈ విజయం భారతీయుల్లో స్ఫూర్తిని నింపింది. ప్రపంచపటంలో భారత్ కీర్తిని చాటి చెప్పింది. ఇప్పుడు ప్రపంచమంతా చంద్రయాన్-3 గురించే చర్చ.. అమెరికా, చైనా, రష్యాకే సాధ్యం కానీ చంద్రుని దక్షిణ ధృవంపై అడుగుపెట్టడమంటే సాధారణ విషయం కాదు కదా! Well Done Champ ❤️ Credits: @fide_chess#chess #praggnanandha #PraggnanandhaaVsCarlsen #Pragg #FIDEWorldCupFinal #chessbaseindia pic.twitter.com/ZcKalA8Jrv — ChessBase India (@ChessbaseIndia) August 24, 2023 ఆగస్టు 24- ప్రజ్ఞానంద: చంద్రయాన్-3 గెలుపు తర్వాత అందరిచూపు 18ఏళ్ల టీనేజ్ కుర్రాడు, చెస్ ప్రాడజీ ప్రజ్ఞానంద(Praggnanandhaa)పై పడింది. చెస్ దిగ్గజం కార్ల్‌సెన్‌పై ఫైనల్‌లో టై బ్రేక్ వరకు వచ్చిన ప్రజ్ఞానంద చివరి మెట్టుపై బోల్తా పడ్డాడు. ఫైనల్‌లో ఓడినా ప్రజ్ఞానంద ప్రపంచం దృష్టిని ఆకర్షించాడు. అందరి మనసులను గెలుచుకున్నాడు. ఓ 18ఏళ్ల కుర్రాడు కార్ల్‌సెన్ లాంటి దిగ్గజంపై చూపించిన పరిణితికి యావత్ ప్రపంచం ఫిదా అయ్యింది. నిజానికి మ్యాచ్ మొదలైన టైమ్‌లో ప్రజ్ఞానంద ఓ రాంగ్ మూవ్ చేశాడు. కార్ల్‌సెన్ తన లైట్-స్క్వేర్డ్ బిషప్‌తో తీసిన తన నైట్‌ని f5కి పెట్టడంలో ప్రాగ్ పెద్ద తప్పు చేశాడు. అయినా ప్రజ్ఙానంద కాసేపటికే మళ్లీ లీడ్‌లోకి వచ్చాడు. అయితే ప్రజ్ఞానంద మూవ్స్ కోసం టైమ్ ఎక్కువ తీసుకోవడంతో మళ్లీ డిఫెన్స్‌లో పడిపోయాడు. చివరకు కార్ల్‌సెన్‌నే విజయం వరించింది. ప్రాగ్ ఓడిపోయినా అందరూ అతడిని ఆకాశానికి ఎత్తేశారు. ఇది ఓటమి కాదు గెలుపేనంటూ కీర్తించారు. 'Neeraj chopra life' Utho, Practice karo, Gold jeeto, So jao. Repeat 🔥❤️ #NeerajChoprapic.twitter.com/8gIBTYy6TF — Prayag (@theprayagtiwari) August 27, 2023 ఆగస్టు 27,28- నీరజ్ చోప్రా: ప్రపంచ అథ్లెటిక్స్ ఛాంపియన్‌షిప్‌లో స్వర్ణం గెలిచిన తొలి భారతీయుడిగా నీరజ్ చోప్రా(neeraj chopra) చరిత్ర సృష్టించాడు. ఒలింపిక్ ఛాంపియన్ నీరజ్ చోప్రా పురుషుల జావెలిన్ ఫైనల్‌లో 88.17 మీటర్ల బెస్ట్ త్రోతో ప్రపంచ అథ్లెటిక్స్ ఛాంపియన్‌షిప్‌లో బంగారు పతకాన్ని గెలుచుకున్నాడు. 25 ఏళ్ల చోప్రా పోటీలో ఆధిపత్యం చెలాయించాడు. రెండో ప్రయత్నంలో అత్యుత్తమ త్రో సాధించాడు. ప్రారంభంలో ఒక ఫౌల్ వేసినా తర్వాత మాత్రం దూకుడు కనబరిచాడ. 88.17మీ, 86.32మీ, 84.64మీ, 87.73మీ, 83.98మీటర్లతో సత్తా చాటాడు. కామన్వెల్త్ గేమ్స్‌లో పాకిస్థాన్‌కు చెందిన ప్రస్తుత చాంపియన్ అర్షద్ నదీమ్ తన సీజన్‌లో అత్యుత్తమంగా 87.82 మీటర్ల త్రోతో రజతం కైవసం చేసుకోగా, చెక్ రిపబ్లిక్‌కు చెందిన జాకుబ్ వడ్లెజ్ (86.67 మీటర్లు) కాంస్యం అందుకున్నాడు. నీరజ్ చోప్రా గెలుపుతో ఇండియన్ స్పోర్ట్స్ లవర్స్‌తో ఆనందంలో మునిగిపోయారు. దటీజ్ నీరజ్ అంటూ సోషల్‌మీడియాలో హోరెత్తిస్తున్నారు. ఇలా వరుస పెట్టి భారతీయులకు ఈ వారం అదిరిపోయే ఆనందాన్ని ఇచ్చింది.. చెరిగిపోని జ్ఞాపకాలను మిగిల్చింది. Throw that India first ever GOLD‼️ 🇮🇳's #NeerajChopra goes BIG, launches an absolute missile in the the men's javelin throw Final 88.17m and a 🥇 #WorldAthleticsChamps #Budapest23 pic.twitter.com/nfiFjpsydk — Karamdeep (@oyeekd) August 27, 2023 ALSO READ: గోల్డ్ మెడల్ సాధించిన తొలి భారతీయ అథ్లెట్‌గా నీరజ్ చోప్రా రికార్డ్..!! #chandrayaan-3 #praggnanandhaa #neeraj-chopra మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి