ఆరు రోజులు.. మూడు విజయాలు.. వేల జ్ఞాపకాలు..భారతీయుల గుండెల్లో ఈ వారం పదిలం!
ఇండియా సత్తా అంటే ఇలా ఉంటుంది బ్రో.. అని చెప్పుకునే విధంగా గడిచాయి ఈ ఆరు రోజులు. చంద్రయన్-3, ప్రజ్ఞానంద, నీరజ్ చోప్రా సాధించిన ఘనతలతో భారతీయుల ఆనందానికి హద్దే లేకుండాపోయింది. జాబిల్లి దక్షిణ ధృవంపై చంద్రయాన్-3 అడుగుపెట్టడం.. చెస్ ప్రాడజీ ప్రజ్ఞానంద సిల్వర్ మెడల్ సాధించడం.. ప్రపంచ అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్లో నీరజ్ చోప్రా గోల్డ్ గెలవడం ఈ ఆరు రోజుల్లోనే జరగడం భారతీయులను ఖుషీ చేసింది.