AP Govt : చంద్రన్న బీమా రూ.10లక్షలకు పెంపు

చంద్రన్న బీమా పరిహారాన్ని పెంచుతున్నట్లు రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్‌ తెలిపారు. ఇంతకు ముందు ఇది రూ. 3 లక్షలు ఉండగా..ఇప్పుడు దానిని 10 లక్షలకు పెంచుతున్నట్లు మంత్రి సుభాష్‌ తెలిపారు.

AP Govt : చంద్రన్న బీమా రూ.10లక్షలకు పెంపు
New Update

Chandranna Insurance : ఏపీ (Andhra Pradesh) లో కూటమి ప్రభుత్వం (Alliance Government) ఏర్పడిన తరువాత ఇంతకు ముందు ఉన్న పథకాల్లో చాలా మార్పులు చోటు చేసుకుంటున్నాయి. తాజాగా చంద్రన్న బీమా పరిహారాన్ని పెంచుతున్నట్లు రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్‌ (Vasamsetti Subash) తెలిపారు. ఇంతకు ముందు ఇది రూ. 3 లక్షలు ఉండగా..ఇప్పుడు దానిని 10 లక్షలకు పెంచుతున్నట్లు మంత్రి సుభాష్‌ తెలిపారు.

అతి త్వరలోనే పాత్రికేయులు, న్యాయవాదుల్ని కూడా ఈ బీమా (Insurance) చేర్చేందుకు యోచిస్తున్నట్లు మంత్రి తెలిపారు. గత ప్రభుత్వం ఈ పథకం పేరు మార్చడంతో పాటు ఎంతోమందికి పరిహారాన్ని నిలిపివేసిందన్ని విమర్శించారు. కార్మికులు కార్మికశాఖలో రూ.15 కట్టి ఈ పథకంలో చేరొచ్చని మంత్రి తెలిపారు. ప్రమాదవశాత్తు మరణిస్తే రూ.10 లక్షల పరిహారం అందుతుందని అధికారులు పేర్కొన్నారు.

Also read: ‘దిశ’ ఇక నుంచి ”ఉమెన్‌ సేఫ్టీ యాప్”!

#andhra-pradesh #politics #minister-subhash #chandranna-insurance
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe