Chandramohan Death: చంద్రమోహన్‌, బాలు, విశ్వనాథ్ బంధువులే.. వీరి మధ్య రిలేషన్ ఇదే!

New Update
Chandramohan Death: చంద్రమోహన్‌, బాలు, విశ్వనాథ్ బంధువులే.. వీరి మధ్య రిలేషన్ ఇదే!

Chandramohan: దివంగత గాయకుడు ఎస్.పి. బాలసుబ్రహ్మణ్యం (S. P. Balasubrahmanyam), కె.విశ్వనాథ్ (K.Viswanath), చంద్రమోహన్‌లు ముగ్గురు బంధువులేననే విషయం ఇప్పటికీ చాలామందికి తెలియకపోవడం విశేషం. కాగా ఈ ముగ్గురి తల్లులు అక్కచెల్లెళ్లు. అయితే ఈ సీక్రెట్ బయటకు రాకుండా చాలా రోజులు వీరు ముగ్గురు జాగ్రత్త పడ్డారు. కాలక్రమంలో కొంతమందికి తెలిసినప్పటికీ ఎవరూ దీని గురించి మాట్లాడలేదు. ఒకరిపట్ల ఒకరికి విపరీతమైన ప్రేమ, గౌరవం ఉండేదని సినీ ఇండస్ట్రీలో చెప్పకుంటారు. అయితే ఇండస్ట్రీలో స్థిరపడ్డాకే ఈ ముగ్గురు బంధువులన్న విషయం బటయకు వచ్చింది. వీరి కుటుంబాలు వేరు వేరు చోట్ల స్థిరపడటం వల్ల ఈ విషయం చాలా రోజులు ఎవరికీ తెలియలేదట.

Also Read: చంద్రమోహన్ అంత్యక్రియలు మరింత ఆలస్యం.. కారణమిదే?

ప్రతీ ఇంట్లోనూ అభిప్రాయ బేధాలు మామూలే. అలానే వీరి ముగ్గురికి కూడా అప్పుడప్పుడు అభిప్రాయ బేధాలు వచ్చినా.. కలిసి ఉండేవారని సినీ పెద్దలు చెబుతూ ఉంటారు. చంద్రమోహన్, విశ్వనాథ్ చెన్నైలో పక్కపక్కనే నివాసాలు కట్టుకొని సెటిల్ అయ్యారు. ఇలా సినిమా ఇండస్ట్రీలోకి వచ్చిన ముగ్గురు అన్నదమ్ములు పరిశ్రమను ఏలారు. ఆ మధ్య బాలసుబ్రమణ్యం కన్నుమూసినప్పుడు అతడిని తలుచుకుంటూ విశ్వనాధ్ కంటనీరు పెట్టుకున్నారు. సిరివెన్నెల, బాలసుబ్రహ్మణ్యం నాకు రెండు కళ్లాలాంటివారని, ఇద్దరూ కన్నుమూశాక అంధుడిని అయిపోయానని కన్నీటి పర్యంతమయ్యారు.
Also Read:  ప్రేక్షకుల హృదయాల్లో చంద్రమోహన్‌ది చెరగని ముద్ర.. కేసీఆర్, చిరంజీవితో పాటు ప్రముఖలు ఏమన్నారంటే?

నిజానికి విశ్వనాధ్ కు పరిశ్రమకు రావాలనే ఆసక్తి ఉండేది కాదు. అయితే ఆయన తండ్రి వాహిని స్టూడియోలో పనిచేస్తూ ఉండటం వల్ల ఆయన మాట కాదనలేక సౌండ్ రికార్డింగ్ అసిస్టెంట్ గా చేరారు. పని అయినా నిబద్ధతతో చేసే విశ్వనాథ్ ఆదుర్తి సుబ్బారావు కంట్లో పడటం, అలా దర్శకత్వ విభాగంలోకి రావటం చకచకా జరిగిపోయాయి. అనతి కాలంలోనే డైరెక్టర్ గా ఆత్మగౌరవం సినిమాను ఆయన నాగేశ్వరరావు తో తీశారు. ఆ తర్వాత కాలక్రమంలో అగ్రదర్శకుడిగా మారి తెలుగు సినిమాపై తనదైన ప్రత్యేక ముద్ర వేశారు.

Advertisment
Advertisment
తాజా కథనాలు