Chandrababu Arrest : చంద్రబాబుకు వైద్య పరీక్షలు పూర్తి.. మరికాసేపట్లో ఏసీబీ కోర్టులో హాజరుపరుచనున్న పోలీసులు..!!

టీడీపీ అధినేత, ఏపీ మాజీ సీఎం చంద్రబాబు స్కిల్ డెవలప్ మెంట్ కేసులో అరెస్టైన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా ఆయన విచారణ ముగిసింది. తాడేపల్లిలోని సిట్ కార్యాలయంలో దాదాపు పదిగంటలపాటు సీఐడీ విచారించింది. అనంతరం చంద్రబాబుకు వైద్య పరీక్షలు నిర్వహించారు.

Chandrababu Arrest : చంద్రబాబుకు వైద్య పరీక్షలు పూర్తి.. మరికాసేపట్లో ఏసీబీ కోర్టులో హాజరుపరుచనున్న పోలీసులు..!!
New Update

టీడీపీ అధినేత, ఏపీ మాజీ సీఎం చంద్రబాబు స్కిల్ డెవలప్ మెంట్ కేసులో అరెస్టైన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా ఆయన విచారణ ముగిసింది. తాడేపల్లిలోని సిట్ కార్యాలయంలో దాదాపు పదిగంటలపాటు సీఐడీ విచారించింది. అనంతరం చంద్రబాబుకు వైద్య పరీక్షలు నిర్వహించారు. నిపుణుల పర్యవేక్షణలో చంద్రబాబుకు విజయవాడ ప్రభుత్వాసుపత్రిలో వైద్యపరీక్షలు చేయించారు. మరికాసేపట్లో చంద్రబాబును ఏసీబీ కోర్టు జడ్జి ముందు ప్రవేశపెట్టే అవకాశం ఉంది.

చంద్రబాబును విజయవాడ ప్రభుత్వాసుపత్రికి తరలించిన నేపథ్యంలో అక్కడ భారీగా బందోబస్తును ఏర్పాటు చేశారు. అప్పటికే వైద్యులను సిద్ధం చేసిన అధికారులు చంద్రబాబుకు వైద్య పరీక్షలను ఎలాంటి అంతరాయం లేకుండా చేశారు. సీపీ క్రాంతి రాణా భద్రతాపరమైన అంశాలను స్వయంగా పర్యవేక్షిస్తున్నారు. పోలీసుల రిమాండ్ రిపోర్టులో ఈ వైద్య పరీక్షలు కీలకంగా మారనున్నాయి. చంద్రబాబును మరికాసేపట్లో ఏసీబీ కోర్టులో ప్రవేశపెట్టనున్న నేపథ్యంలో నారాలోకేష్ ఆయన తరపున లాయర్లు కోర్టుకు చేరుకున్నారు.

ఇక ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పోలీసుల సహకారం తో డ్రామా ఆడుతూ న్యాయ ప్రక్రియను కూడా అపహాస్యం చేస్తుందని కనకమేడల రవీంద్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. నోటీసులు లేకుండా అరెస్ట్ చేయడం, కుటుంబ సభ్యులను కలవకుండా చేయడం దుర్మార్గమైన చర్య అన్నారు. కోర్ట్ అనుమతి లేకుండా చంద్రబాబు ను ఇన్ని గంటలు కూర్చోబెట్టి పోలీసులు కర్కశంగా వ్యవహారిస్తున్నారని మండిపడ్డారు.

పోలీసులు వైసీపీ కార్యకర్తలు లాగా వ్యవహరిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేసిన ఆయన రిమాండ్ రిపోర్ట్ ఇప్పటివరకు తయారు చేయలేదని ప్రశ్నించారు . ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి 16 నెలలు జైల్లో గడిపాడు గనుక చంద్రబాబు ను పదహారు గంటలైన జైలులో ఉంచి వైసీపీ నాయకులు ఆనందం పొందాలనుకుంటున్నారని ఆరోపించారు. ఈ కేసులో పస లేదన కనకమేడల పవన్ కళ్యాణ్ వస్తుంటే అరెస్ట్ చేస్తాం అనడం దారుణమన్నారు. భారతదేశం లో ఇలాంటి రాజకీయం ఏ రాష్ట్రం లో చూడలేదన్నారు.G20 సమావేశాలు జరుగుతున్న ఈ సమయం లో ఇలాంటి చర్యలకు పాల్పడి దేశ గౌరవాన్ని మంట కలిపారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

#gghmedical-checkup #skill-development-case #chandrababu-naidu #andhra-pradesh
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe