TDP: అసమ్మతి నేతలను బుజ్జగించేందుకు చంద్రబాబు ప్రయత్నాలు..!

కడప టీడీపీ అసమ్మతి నేతలను బుజ్జగించేందుకు చంద్రబాబు ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. పార్టీ మారకుండా కట్టడి చేసేందుకు టీడీపీ పట్టుభద్రుల ఎమ్మెల్సీ రాంగోపాల్ రెడ్డి రంగంలోకి దిగారు.

New Update
TDP: ఆ జిల్లాలో 4 అసెంబ్లీ స్థానాలపై రాని క్లారిటీ.. అయోమయంలో పార్టీ క్యాడర్..!

TDP Chief chandrababu: టీడీపీ - జనసేన కూటమి తొలి జాబితాలో టికెట్‌ ఆశించి భంగపడిన నేతలు తిరుగుబాటు చేస్తున్నారు. పార్టీకి రాజీనామా చేసేందుకు కూడా వెనకడుగు వేయడం లేదు. పలుచోట్ల ఫ్లెక్సీలు చించివేస్తూ రచ్చ రచ్చ చేస్తున్నారు. దీంతో పార్టీ అధినేతల్లో కలవరం మొదలైంది. పార్టీ మారకుండా కట్టడి చేసేందుకు మంతనాలు చేస్తున్నారు.

బుజ్జగింపులు

తాజాగా, కడప జిల్లాలో టీడీపీ అసమ్మతి నేతలను బుజ్జగించేందుకు చంద్రబాబు ప్రయత్నాలు మొదలుపెట్టారు. టీడీపీ పట్టుభద్రుల ఎమ్మెల్సీ రాంగోపాల్ రెడ్డి చంద్రబాబు దూతగా రంగంలోకి దిగారు. టీడీపీ నేత లక్కిరెడ్డిపల్లె, మాజీ ఎమ్మెల్యే వైసీపీ నేత విజయసాయి రెడ్డి బామ్మర్థి గడికోట ద్వారకనాథ రెడ్డితో ఆయన భేటీ అయ్యారు.

Also Read: ఆ విషయంలో మాత్రం వరుణ్‌ మీద చాలా కోపంగా ఉంది : చిరంజీవి!

వ్యతిరేకిస్తున్న వర్గాలు

రాయచోటి టీడీపీ అభ్యర్థిగా మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి పేరును ప్రకటంచడంతో నియోజకవర్గ టీడీపీ ఇంఛార్జ్ రమేష్ కుమార్ రెడ్డి వర్గియులు..  మాజీ ఎమ్మెల్యే ద్వారకనాథ్ రెడ్డి అనుచరులు అసంతృప్తిగా ఉన్నారు. పార్టీ పదవులకు రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు రమేష్ రెడ్డి వర్గీయలు. మండిపల్లి పేరు ప్రకటించడాన్ని వ్యతిరేకిస్తున్న ద్వారకనాథ్ రెడ్డి అనుచరులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అర్దరాత్రి ప్రాంతంలో లక్కీరెడ్డిపల్లి చౌరస్తాలో టీడీపీ జెండాలకు నిప్పు పెట్టి దగ్ధం చేశారు. చంద్రబాబు నాయుడు పోస్టర్లను చెప్పులతో కొడుతూ నిరసన చేశారు.

కట్టడి చేస్తారా?

టీడీపీకి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. అసంతృప్తితో ఉన్న నేతలతో చర్చించి పార్టీ మారకుండా చూడాల్సిన భాద్యత రాంగోపాల్ రెడ్డి పై పెట్టారు చంద్రబాబు.. మరి రాంగోపాల్ రెడ్డి అసంతృప్తులను పార్టీ మారకుండా కట్టడి చేస్తారా? లేదా? అనేది తెలియాల్సి ఉంది. కాగా, కాసేపట్లో రమేష్ రెడ్డితో కూడా భేటీ అయ్యే అవకాశం కనిపిస్తోంది.

Also watch This video:

Advertisment
తాజా కథనాలు